ఐపీఎల్ కు గ్లెన్ మాక్స్‌వెల్ గుడ్ బై.. టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులోనైనా ఉంటాడా?

By Mahesh Rajamoni  |  First Published Apr 16, 2024, 5:43 PM IST

Glenn Maxwell : ఆర్సీబీ స్టార్ ప్లేయ‌ర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2024 కు దూరమయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియా దిగ్గ‌జ ప్లేయ‌ర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. స్టార్ ఆర్సీబీ ఆటగాడిగా నిరంతరం ఒత్తిడి అతనిపై పడిందనీ,  ఆట నుండి విరామం తీసుకోవ‌డంతో మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మ్యాక్సీ స‌రైన నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అన్నారు.
 


Glenn Maxwell : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయ‌ర్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్ర‌స్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కు దూరం అయ్యాడు. ఐపీఎల్ కొన‌సాగుతుండ‌గానే మ‌ధ్య‌లోనే విరామం తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయం తర్వాత మీడియాతో మాట్లాడిన మ్యాక్స్‌వెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పేలవమైన ఫామ్ కారణంగా చాలా విమర్శలను ఎదుర్కొన్న మాక్స్‌వెల్, హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో ప్లేయింగ్ 11 నుంచి స్థానం కోల్పోయాడు. మ్యాక్సీ స్థానంలో విల్ జాక్స్  ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ మీడియాతో మాట్లాడుతూ..  ప్రస్తుతం తాను మంచి మానసిక, శారీరక అంత బాగాలేదనీ, అందుకే కాస్త విరామం తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పాడు. ఇదే విష‌యాన్ని కెప్టెన్ డు ప్లెసిస్ కు చెప్పిన‌ట్టు వెల్ల‌డించాడు. అలాగే, "నాకు వ్యక్తిగతంగా, ఇది చాలా సులభమైన నిర్ణయమ‌ని" ఏడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఆరు ఓటముల తర్వాత మాక్స్‌వెల్ చెప్పాడు. "నేను చివరి ఆట తర్వాత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, కోచ్‌ల వద్దకు వెళ్లాను.. త‌న స్థానంలో మనం వేరొకరిని ప్రయత్నించే సమయం వచ్చిందని నేను భావించాను. నేను గతంలోనూ ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాను. నేను మానసికంగా, శారీరకంగా కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఇప్పుడు మంచి సమయం అని నేను భావిస్తున్నాను, టోర్నమెంట్ సమయంలో నేను ప్రవేశించవలసి వస్తే, నేను నిజంగా దృఢమైన మానసిక స్థితికి చేరుకోగలనని ఆశిస్తున్నాను" అని మ్యాక్స్ వెల్ పేర్కొన్నాడు.

Latest Videos

42 ఏండ్ల వ‌య‌స్సులోనూ దుమ్మురేపాడు.. ధోని దెబ్బ‌కు హార్దిక్ అబ్బా.. సరికొత్త రికార్డులు

మాక్స్‌వెల్ మానసిక అలసటతో ఆట నుండి విరామం తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గ‌తంలోనూ ఇలా వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న స‌మ‌యంలోనూ మ్యాక్స్ వెల్ క్రికెట్ కు కొంత స‌మ‌యం విరామం తీసుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గ్రౌండ్ లోకి వ‌చ్చి దుమ్మురేపే ఫామ్ ను కొన‌సాగించాడు. కాగా, ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ ఆట‌తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఐపిఎల్‌లో మాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన గురించి విమర్శించాడు. అత‌ను ఫాస్ట్ బౌలింగ్‌ను ఆడలేకపోతున్నాడని కామెంట్ చేశాడు. కాగా, ఐపీఎల్ 2024 లో మాక్స్‌వెల్ స్కోర్లు గ‌మ‌నిస్తే 0, 3, 28, 0, 1, 0 గా ఉన్నాయి. మూడు సార్లు డ‌కౌట్ గానే వెనుదిరిగాడు. ఇదే క్ర‌మంలో ఆర్సీబీ ఈ సీజ‌న్ లో 5 ఓట‌ముల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో కొన‌సాగుతోంది. ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 జ‌ర‌గ‌నుంది. దీంతో ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌లు రాబోయే మేగా టోర్నీ జ‌ట్టులో మ్యాక్స్ వెల్ స్థానంపై ప్ర‌భావం చూప‌నుందని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఐపీఎల్ లో ఇదే లాంగెస్ట్ సిక్స‌ర్.. సూప‌ర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపిన దినేష్ కార్తీక్

click me!