ఆల్ రౌండర్ షో తో అదరగొట్టిన జూనియర్ ద్రవిడ్... బ్యాట్ పట్టాడంటే సెంచరీలే..

By telugu news teamFirst Published Feb 26, 2020, 8:44 AM IST
Highlights


 రెండు నెలల లోపే రెండు డబుల్ సెంచరీలు బాదిన సమిత్.. తాజాగా మరో ద్విశతకాన్ని కొద్దిలో మిస్సయ్యాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ 1, డివిజన్ 2 టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం విద్యాశిల్ప్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో సమిత్ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 
 

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మరోసారి  చెలరేగిపోయాడు. మరోసారి తన సత్తా చాటాడు.  ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి అందరి చేత ఆహా అనిపించుకుంటున్నాడు.

 రెండు నెలల లోపే రెండు డబుల్ సెంచరీలు బాదిన సమిత్.. తాజాగా మరో ద్విశతకాన్ని కొద్దిలో మిస్సయ్యాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ 1, డివిజన్ 2 టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం విద్యాశిల్ప్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో సమిత్ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 

Also Read తండ్రికి తగ్గ తనయుడు: ద్రావిడ్ కుమారుడి మరో డబుల్ ధమాకా...

131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేసి అవుటయ్యాడు. మరోవైపు, బంతితోనూ సత్తా చాటాడు. నాలుగు వికెట్లు పడగొట్టి తమ జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ సెమీఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సమిత్.. ఇటీవల రెండు నెలల్లోపే రెండు ద్విశతకాలు బాదాడు. తాజాగా త్రుటిలో మరో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. సమిత్ బ్యాటింగ్‌పై మాల్యా అదితి ఇంట్నేషనల్ స్కూల్ ప్రశంసలు కురిపించింది. ఈ మ్యాచ్‌లో సమిత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం 331 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విద్యాశిల్ప్ అకాడమీ జట్టు 38.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ నెల 15న 14 ఏళ్ల సమిత్ శ్రీ కుమరన్ చిల్డ్రన్స్ అకాడమీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 146 బంతుల్లో 33 బౌండరీలతో ఈ ద్విశకతం బాదాడు. అంతకుముందు గతేడాది డిసెంబరులో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమిత్.. ధర్వాడా జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి డబుల్ సెంచరీ చేశాడు. 

click me!