భారత్-విండీస్ మ్యాచ్‌లో కొత్త రూల్: ఆయన చెప్పినట్లు ఫీల్డ్ అంపైర్లు చేయాల్సిందే

By sivanagaprasad KodatiFirst Published Dec 5, 2019, 8:15 PM IST
Highlights

గతంలో బౌలర్ నో బాల్ వేస్తే ఫీల్డ్ ఎంపైర్లు దానిని గుర్తించేవారు. అయితే భారత్-వెస్టిండీస్‌ మధ్య జరిగే వన్డే, టీ20 సిరీసుల నుంచి నో బాల్‌ను థర్డ్ అంపైర్ నిర్ణయిస్తారని ఐసీసీ ప్రకటించింది

గతంలో బౌలర్ నో బాల్ వేస్తే ఫీల్డ్ ఎంపైర్లు దానిని గుర్తించేవారు. అయితే భారత్-వెస్టిండీస్‌ మధ్య జరిగే వన్డే, టీ20 సిరీసుల నుంచి నో బాల్‌ను థర్డ్ అంపైర్ నిర్ణయిస్తారని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లు మిగిలిన బాధ్యతలు చూసుకుంటారని.. థర్డ్ అంపైర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను గుర్తిస్తారని తెలిపింది.

దీనిలో భాగంగా ప్రతి బంతిని పర్యవేక్షించడం, బౌలర్ పాదాన్ని క్రీజు బయట పెట్టాడో లేదో గుర్తిస్తారు. ఒకవేళ బౌలర్ క్రీజును దాటితే థర్డ్ అంపైర్‌ ఆ సమాచారాన్ని ఫీల్డ్ అంపైర్‌కు అందజేస్తారు.. అప్పుడు వారు నోబాల్‌గా ప్రకటిస్తారు. ఇదే సమయంలో థర్డ్ అంపైర్ నుంచి నోబాల్ ప్రకటన ఆలస్యమైతే బ్యాట్స్‌మెన్ ఔట్‌ను ఫీల్డ్ అంపైర్లు వెనక్కి తీసుకుంటారు.

Also Read:కేదార్ జాదవ్ ఫోటో: ఫోజులు కాదు బ్యాటింగ్ సంగతి చూడంటూ రోహిత్ సెటైర్లు

ఈ సిరీస్‌తో పాటు కొన్ని నెలలు ఈ ప్రయోగాన్ని పరీక్షించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఐసీసీ భావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంతకాలంగా నో బాల్స్‌ అంశంలో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

బ్రిస్బేన్ వేదికగా ఆసీస్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లు 21 ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించకపోవడం విమర్శలకు దారి తీసింది. ఒక సెకను కాలంలో నో బాల్, బాల్ లెంగ్త్, దిశ, ఎల్బీడబ్ల్యూ వంటి అంశాలను ఏకకాలంలో గుర్తించడం కష్టతరంగా మారిందని అంపైర్లు తెలియజేశారు.

Also Read:ధోనీ అంటూ అరవకండి: పంత్ పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

దీంతో ఈ బాధ్యతను థర్డ్ అంపైర్‌కు అప్పగించాలని పలువురు సూచించారు కూడా. అయితే ఐసీసీ నిర్ణయాన్ని మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పుబట్టాడు. ఇప్పటికే డీఆర్ఎస్, రనౌట్స్ వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న థర్డ్ అంపైర్లపై ఈ నిబంధన మరింత భారం పడేలా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

click me!