అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్.. రిటైర్మెంట్ ప్రకటన..

Published : Jan 31, 2022, 05:31 PM IST
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్.. రిటైర్మెంట్ ప్రకటన..

సారాంశం

Tim Bresnan Announces Retirement: కెరీర్ లో వార్విక్‌షైర్  తో పాటు జాతీయ జట్టుకు  ప్రాతినిథ్యం వహించడం  తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పిన బ్రెస్నన్.. ఇంగ్లాండ్ కు తొలి  ప్రపంచకప్ అందించిన జట్టులో సభ్యుడు.   

ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్  టిమ్ బ్రెస్నన్  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్ తరఫున సుమారు పది సంవత్సరాల పాటు సేవలందించిన అతడు.. అంతర్జాతీయ కెరీర్ తో పాటు తన సొంత జట్టు..  వార్విక్‌షైర్  కౌంటీకి కూడా వీడ్కోలు పలికాడు. ఆ  కౌంటీకి  అతడు సుమారు 21 ఏండ్ల పాటుగా ఆడాడు. జాతీయ జట్టులో తక్కువ కాలమే ఆడినా.. కౌంటీ తరఫున మాత్రం  సుదీర్ఘ కెరీర్ బ్రెస్నన్ కు సొంతం. బ్రెస్నన్ రిటైర్ అవుతున్నట్టు అతడు ఇన్నాళ్లు ప్రాతినిథ్యం వహించిన కౌంటీ  వార్విక్‌షైర్  కూడా తెలిపింది.  ఇంగ్లాండ్ జట్టు తొలి సారిగా  ప్రపంచకప్ (2010 టీ20 వరల్డ్ కప్) లో బ్రెస్నన్ సభ్యుడు. 2010-11 ఇంగ్లాండ్ గెలిచిన యాషెస్ సిరీస్ లో కూడా బ్రెస్నన్ కీలక ఆటగాడిగా వ్యవహరించాడు.  

తన రిటైర్మెంట్ నిర్ణయంపై బ్రెస్నన్ ఓ ప్రకటన చేస్తూ... ‘ఇది  చాలా కఠినమైన నిర్ణయం. కానీ  ఇదే సరైన సమయమని నేను అనుకుంటున్నాను.  21 సంవత్సరాల నా సుదీర్ఘ కెరీర్ లో ప్రతి  రోజూ నిజాయితీగా కష్టపడ్డాను. అయితే  నాకోసం నేను నిర్దేశించుకున్న ప్రమాణాలను మాత్రం  గత కొంతకాలంగా నేను అందుకోవడం లేదు. 

 

నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన కొత్తలో ఉన్న ఉత్సాహం, ఆసక్తి ఎప్పటికీ నాలో తగ్గవు . కానీ అందుకు నా శరీరం సహకరించడం లేదు..’ అని తెలిపాడు. 

తన  కెరీర్ లో వార్విక్‌షైర్  తో పాటు జాతీయ జట్టుకు  ప్రాతినిథ్యం వహించడం  తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని బ్రెస్నన్  అన్నాడు. క్రికెటర్ గా తాను ఎదిగే క్రమంలో  అత్యుత్తమ క్రికెటర్లతో కలిసి ఆడటం తన అదృష్టమని తెలిపాడు. 

 

ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫు (2006-2015) న సుమారు  తొమ్మిదేండ్ల పాటు ఆడాడు బ్రెస్నన్. 23 టెస్టులు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్టులలో 72 వికెట్లు తీసిన  బ్రెస్నన్.. వన్డేలలో 109 వికెట్లు పడగొట్టాడు.  టీ20లలో 24 మందిని పెవిలియన్ కు పంపాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్ విషయానికొస్తే.. వార్విక్‌షైర్ కౌంటీ తరఫున  213 మ్యాచులు ఆడి 575 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్ గా 7,128 పరుగులు కూడా చేశాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?