ఆంధ్రా సీఎం జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే... కారణం ఇదేనా...

Published : Jul 05, 2021, 04:39 PM IST
ఆంధ్రా సీఎం జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే... కారణం ఇదేనా...

సారాంశం

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్‌ని కలిసిన అనిల్ కుంబ్లే... ఏపీ సీఎంకి తన ఇన్నింగ్స్‌కి సంబంధించిన జ్ఞాపికను అందచేసిన టీమిండియా మాజీ కోచ్...

భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌‌లో పదికి పది వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లలో ఒక్కడైన అనిల్ కుంబ్లే, జగన్‌కి జ్ఞాపిక, తన క్రికెట్ ఇన్నింగ్స్‌కి సంబంధిన ఫ్రేమ్‌ను అందచేశారు.

ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లేకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని అందించి కండువాతో సత్కరించారు. 

 

మాజీ క్రికెటర్, సీఎం జగన్‌ని కలవడానికి కారణాలు ఏంటనేది తెలియకపోయినా అనిల్ కుంబ్లే... ఆంధ్రాలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ పనులకు సంబంధించి కలిసి ఉండొచ్చని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే