కెప్టెన్‌గా ధోనీ.. బీసీసీఐకి నేనే ప్రతిపాదించా: మిస్టర్ కూల్‌తో అనుబంధంపై సచిన్

By Siva KodatiFirst Published Aug 19, 2020, 3:35 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడాన్ని ఇంకా ఆయన అభిమానులు, ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడాన్ని ఇంకా ఆయన అభిమానులు, ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజాగా భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సారథ్య బాధ్యతల్ని ధోనీకి అప్పగించాలని తానే సూచించినట్లు సచిన్ చెప్పారు.

2007లో దక్షిణాఫ్రికా వేదికగా మొదటిసారి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. గాయాల కారణంగా టోర్నీకి దూరంగా ఉండాలని భావించానని తెలిపాడు.

అయితే తనతో పాటు గంగూలీ, ద్రవిడ్‌లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే టీ20 జట్టుకు ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ అడిగినప్పుడు, తానే ధోనీ పేరును సూచించానని సచిన్ తెలిపాడు.

అంతకుముందు చాలా మ్యాచ్‌ల్లో ఫస్ట్‌స్లిప్‌లో నిల్చొని ధోనీ ఆటను, మైదానంలో అతను వ్యవహరించే తీరును దగ్గర్నుంచి పరిశీలించానని పేర్కొన్నాడు. దీంతో పాటు స్లిప్స్‌లో నిలుచున్నప్పుడు ఫీల్డింగ్‌తో పాటు పలు అంశాలపై తాను ధోనితో చర్చించేవాడినని తెలిపాడు.

ఆ సమయంలోనే ధోనికి మ్యాచ్‌ను పూర్తిగా చదివేస్తాడని.. భవిష్యత్తు కెప్టెన్ అతనేనని అప్పుడే ఊహించానని టెండూల్కర్ అన్నారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయో మీ అందరికి తెలిసిందేనని సచిన్ పీటీఐ ఇంటర్వ్యూలో గత అనుభవాలు గుర్తుచేసుకున్నాడు.

click me!