
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్ అదరగొట్టాడు. టాపార్డర్ విఫలమైనా, సామ్ బిల్లింగ్స్, రస్సెల్ అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేయగలిగింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్..
6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ని మార్కో జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది కేకేఆర్. అజింకా రహానే, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీశ్ రాణా 16 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
24 బంతుల్లో 3 సిక్సర్లతో 28 పరుగులు చేసిన అజింకా రహానే కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లోనే శశాంక్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
రింకూ సింగ్ 5 పరుగులు చేసి నిరాశపరచడంతో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. 29 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్‌ని భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చగా ఆండ్రే రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
వాషింగ్టన్ సుందర్ వేసిన ఆఖరి ఓవర్‌లో 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు ఆండ్రే రస్సెల్. 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు ఆండ్రే రస్సెల్... ఐపీఎల్ గత ఐదేళ్లలో ఆండ్రే రస్సెల్ 49 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలవడం ఇది నాలుగోసారి.
2018లో రాజస్థాన్ రాయల్స్‌పై 25 బంతుల్లో, 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 19 బంతుల్లో, 2022లో సన్‌రైజర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 25 బంతుల్లో 49 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్... నేటి మ్యాచ్‌లో 28 బంతుల్లో 49 పరుగుల వద్ద నిలిచాడు. గత ఐదేళ్లలో 49 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయర్ ఆండ్రే రస్సెల్ కావడం విశేషం...
ఈ ఇన్నింగ్స్‌లో కేకేఆర్ తరుపున 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు ఆండ్రే రస్సెల్. ఇంతకుముందు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ 3345 పరుగులు, రాబిన్ ఊతప్ప 2649 పరుగులు, యూసఫ్ పఠాన్ 2061 పరుగులు చేసి ఆండ్రే రస్సెల్ కంటే ముందున్నారు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌కి 3 వికెట్లు దక్కగా మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ తలా ఓ వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదిస్తే, కేకేఆర్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది...