క్రికెట్ బాల్‌తో ఫుట్‌బాల్ ఆడి క్యాచ్ పట్టిన ఫీల్డర్... సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఏంటంటే...

Published : Feb 12, 2023, 04:14 PM ISTUpdated : Feb 12, 2023, 04:15 PM IST
క్రికెట్ బాల్‌తో ఫుట్‌బాల్ ఆడి క్యాచ్ పట్టిన ఫీల్డర్... సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఏంటంటే...

సారాంశం

బౌండరీ లైన్ అవతల గాల్లోకి ఎగురుతూ బంతిని తన్నిన ఫీల్డర్... ఫుట్‌బాల్ బాగా తెలిసిన వ్యక్తితో క్రికెట్ ఆడిస్తే ఇలాగే ఉంటుందంటూ సచిన్ టెండూల్కర్ కామెంట్.. వీడియో వైరల్!

ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఆటల్లో ఫుట్‌బాల్, క్రికెట్ కూడా ఉంటాయి. భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లో క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ ఉంటే, ఈశాన్య దేశాల్లో ఫుట్‌బాల్ క్రేజ్ వేరు. ఈ రెండు ఆటల రూల్స్ పూర్తిగా వేరు. ఫుట్‌బాల్‌లో క్రికెట్ స్టైల్‌లో క్యాచులు పట్టుకునేందుకు ప్లేయర్లకు (ఒక్క కీపర్‌కి తప్ప) అనుమతి ఉండదు. అయితే క్రికెట్‌లో అలాంటి రూల్స్ ఏమీ లేవు... బంతిని చేత్తో కాకపోతే కాలితో కూడా ఆపొచ్చు, క్యాచ్ పట్టవచ్చు...

 

ఇలా తన ఫుట్‌బాల్ స్కిల్స్ వాడి ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడో క్రికెటర్. ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఈ క్రేజీ క్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్యాట్స్‌మెన్ కొట్టిన ఓ షాట్‌ని బౌండరీ లైన్ దగ్గర అందుకునేందుకు ప్రయత్నించిన ఫీల్డర్, అదుపు తప్పి గీత దాటబోయాడు. గీత దాటబోతున్నట్టు గమనించిన అతను, బంతిని పైకి విసిరేసి, బౌండరీ లైన్ అవతల కింద పడబోతున్న బంతిని ఫుట్‌బాల్‌లా గాల్లోకి ఎగిరి తన్నాడు. బౌండరీ లైన్‌కి ఇవతల ఇదంతా గమనిస్తున్న మరో ఫీల్డర్, దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు...

 

అంపైర్ అవుట్ ఇచ్చాడా? లేక నాటౌట్‌‌గా అని తేల్చి సిక్సర్‌గా ప్రకటించాడా తెలీదు కానీ... వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. ‘ఫుట్‌బాల్ ఎలా ఆడాలో తెలిసిన వ్యక్తిని క్రికెట్‌లోకి తీసుకొస్తే ఇలాగే జరుగుతుంది...’ అంటూ ఫుట్‌బాల్, క్రికెట్‌తో పాటు పగలబడి నవ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్...

సచిన్ ట్వీట్ కింద చాలా పెద్ద చర్చే నడుస్తోంది.ఫీల్డర్, ఆ బంతిని కాలితో తన్నే సమయంలో అతని మరో కాలు నేలను తాకి ఉందని కాబట్టి అతను నాటౌట్‌ అని కొందరు అంటుంటే మరికొందరు కాదు, క్యాచ్ పట్టే సమయంలో అతని రెండు కాళ్లు నేలపైన లేవు... గాల్లోనే ఉన్నాడని వాదిస్తున్నారు.. 

ఇంకొందరైతే  బౌండరీ అవతలకి బంతి వెళ్లిన తర్వాత దాన్ని సిక్సర్‌గా ప్రకటించాల్సిందేనని, కింద తగిలితేనే సిక్స్ అనడం కరెక్ట్ కాదని.. ఐసీసీ ఈ విషయంలో రూల్స్ మారిస్తే బ్యాటర్లకు న్యాయం జరుగుతుందని వాపోతున్నారు.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !