2021 సీజన్‌లో రంజీ ట్రోఫీ రద్దు... 87 ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా రంజీ ట్రోఫీకి బ్రేక్...

By team teluguFirst Published Jan 30, 2021, 1:18 PM IST
Highlights

1892లో భారతదేశంలో రంజీ ట్రోఫీ ఆరంభం...

ఇప్పటికే కేవలం రెండు సార్లు మాత్రం రంజీ సీజన్‌కి బ్రేక్...

కరోనా రూల్స్, బిజీ షెడ్యూల్ కారణంగా రంజీ ట్రోఫీని నిర్వహించలేమన్న బీసీసీఐ...

కరోనా కారణంగా ఈ ఏడాది నిర్వహించాల్సిన రంజీ ట్రోపీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. 129 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న రంజీ క్రికెట్ టోర్నీ చరిత్రలో దేశవాళీ లీగ్ రద్దు కావడం ఇది మూడోసారి. 1892లో భారతదేశంలో రంజీ ట్రోఫీ ఆరంభమైంది.

1930-31, 1933-34 సమయంలో దేశంలో స్వాతంత్రోద్యమం నడుస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా రంజీ సీజన్‌కి బ్రేక్ పడింది. 1934 తర్వాత రంజీ ట్రోఫీకి బ్రేక్ పడడం ఇదే తొలిసారి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలను నిర్వహించిన ఏకైక దేశం భారత్.

అలాంటిది ఈసారి కరోనా రూల్స్, బిజీ షెడ్యూల్ కారణంగా రంజీ ట్రోఫీ నిర్వహించలేమని చేతులేత్తేసింది బీసీసీఐ. అయితే విజయ్ హాజరే ట్రోఫీ మాత్రం నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ. భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకునేందుకు రంజీ ట్రోఫీ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటారు సెలక్టర్లు. 

click me!