ది రాక్ తిరిగి వచ్చేశాడు... జస్ప్రిత్ బుమ్రాకి తన స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పిన విరాట్ కోహ్లీ...

By Chinthakindhi RamuFirst Published Dec 29, 2021, 2:03 PM IST
Highlights

బౌలింగ్ చేస్తూ గాయపడి, ఫిజిక్ చికిత్స తర్వాత క్రీజులోకి తిరిగొచ్చిన జస్ప్రిత్ బుమ్రా... భారత స్టార్ పేసర్‌కి తన స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పిన విరాట్ కోహ్లీ...

కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ స్టైల్ చాలా చాలా స్పెషల్. టీమ్ మేట్స్‌ని ప్లేయర్లుగా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ట్రీట్ చేస్తాడు విరాట్. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో జరిగిన ఓ సంఘటన దీన్ని మరోసారి రుజువు చేసింది. 

ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేసి, సఫారీ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు జస్ప్రిత్ బుమ్రా. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే బౌలింగ్ చేస్తూ గాయపడి, పెవిలియన్‌కే చేరుకున్నాడు బుమ్రా. బౌలింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా అరికాలి మడిమ మడత పడడంతో సగటు టీమిండియా అభిమాని... అతనికి ఎంతటి తీవ్రమైన గాయం అయ్యిందోనని భయపడిపోయారు...

ఆ ఓవర్‌లో ఐదు బంతులు వేసిన బుమ్రా, గాయంత క్రీజు వీడడంతో మిగిలిన బంతిని సిరాజ్ వేసి, ఓవర్ పూర్తి చేశాడు. నొప్పితో విలవిలలాడుతూ, కన్నీళ్లు పెట్టుకున్న జస్ప్రిత్ బుమ్రా... ఫిజియో చికిత్స తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని, మళ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు. గాయం నుంచి కోలుకుని, మళ్లీ బౌలింగ్ చేసేందుకు వచ్చిన జస్ప్రిత్ బుమ్రాకి తన స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ...

‘Finally, The Rock is Back...’ (ఫైనల్లీ... ది రాక్ ఇజ్ బ్యాక్) అంటూ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ ది రాక్ ఫేమస్ డైలాగ్‌తో బుమ్రాకి వెల్‌కమ్ చెప్పాడు విరాట్ కోహ్లీ...

జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఇన్నింగ్స్ ఆరంభంలో దూరం కావడంతో సఫారీ జట్టు దాదాపు 50-100 పరుగులు ఎక్కువ చేయగలిగింది. 

మహ్మద్ షమీ 16 ఓవర్లు బౌలింగ్ చేసి 5 మెయిడిన్లతో 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు షమీ... అలాగే డీన్ ఎల్గర్ వికెట్, బుమ్రా టెస్టు కెరీర్‌లో 100వ వికెట్ కావడం విశేషం...

మొత్తంగా భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌కి ఓ వికెట్ దక్కగా... అశ్విన్‌కి వికెట్లు దక్కలేదు...

అంతకుముందు బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా... మూడో రోజు అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.  ఓవర్‌నైట్‌ స్కోరు 272/3 వద్ద మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత జట్టు కెఎల్ రాహుల్ 123, అజింకా రహానే 48 వికెట్లు త్వరత్వరగా కోల్పోయింది...

రిషబ్ పంత్ 8, రవిచంద్రన్ అశ్విన్ 4, శార్దూల్ ఠాకూర్ 4, మహ్మద్ షమీ 8 పరుగులు చేసి అవుట్ కాగా... బుమ్రా 14 పరుగులు చేశాడు. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకి ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా జట్టు 197 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఫలితంగా భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం దక్కింది...

click me!