ఐపీఎల్‌ బొమ్మ చూపించి కోట్లు కొట్టేశారు... ఫేక్ ఐపీఎల్‌తో రష్యన్లను మోసం చేసిన గ్యాంగ్...

Published : Jul 11, 2022, 03:46 PM ISTUpdated : Jul 11, 2022, 03:47 PM IST
ఐపీఎల్‌ బొమ్మ చూపించి కోట్లు కొట్టేశారు... ఫేక్ ఐపీఎల్‌తో రష్యన్లను మోసం చేసిన గ్యాంగ్...

సారాంశం

యూట్యూబ్‌లో ఫేక్ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేసిన గుజరాతీ గ్యాంగ్... రైతు కూలీలకు సీఎస్‌కే, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జెర్సీలు వేసి, హర్షా భోగ్లే కామెంటరీతో... 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ 2023-27 ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.48 వేల కోట్ల ఆదాయం ఆర్జించింది బీసీసీఐ. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్‌ని వాడుకుని, రష్యన్లనే మోసం చేశారు కొందరు కేటుగాళ్లు... గుజరాత్‌లోని మెహ్సనా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు కలిసి, యూట్యూబ్‌లో ఫేక్ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జెర్సీలను ధరించి మ్యాచులు ఆడేవాళ్లు ప్లేయర్లు...

అంతేకాదు ఫేమస్ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే వాయిస్‌ని మిమిక్రీ చేస్తూ, నిజమైన ఐపీఎల్ మ్యాచులను చూస్తున్న అనుభూతి కలిగించారు. ఒక్కో మ్యాచ్‌లో ప్లేయర్లుగా నటించేందుకు కూలీ పని చేసేవాళ్లకు రోజుకి రూ.400 ఇచ్చి తీసుకొచ్చేవాళ్లని తేలింది...

అలాగే అంపైర్లు కూడా ఫేక్ వాకీ టాకీల్లో మాట్లాడుతున్నట్టు నటించేవాళ్లు. యూట్యూబ్‌లో 5HB కెమెరాలను వాడి మ్యాచులను ప్రత్యేక్ష ప్రసారం చేసేవాళ్లు. బెట్టింగ్ చేసేందుకు వీలుగా టెలిగ్రామ్ లింకులను పెట్టేవాళ్లు. ప్రతీ ప్లేయర్‌కి ఏం చేయాలో, ఎలా చేయాలో సూచనలు వెళ్లేవి. ఓ రకంగా పక్కా ప్లాన్‌తో ఎంతో పకడ్భందీగా మూడు వారాల పాటు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులను నిర్వహించారు...

ఇందుకోసం 21 మంది తోట పని చేసే కూలీలను, అదే గ్రామానికి చెందిన కొందరు నిరుద్యోగ యువకులను తీసుకొచ్చారు. స్టేడియంలో వేల మంది మ్యాచుల చూస్తున్నట్టుగా గ్రాఫిక్స్, సౌండ్స్ యాడ్ చేసేవాళ్లు..  ఈ మ్యాచులను చూసి రష్యాకు చెందిన జనాలు, టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ వేయడం మొదలెట్టారు...

ఇప్పటికే ఈ ఫేక్ ఐపీఎల్ క్వార్టర్ ఫైనల్‌కి చేరుకుంది. అయితే బెట్టింగ్‌ని బట్టి రిజల్ట్‌ని డిసైడ్ చేయడంతో రష్యాకి చెందిన టివర్, వొరోనెజ్, మాస్కో నగరాలకు చెందిన చాలా మంది, ఈ లీగ్ కారణంగా లక్షల్లో డబ్బు పొగొట్టుకున్నారు... 

సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మెహ్సానా పోలీసులు ఈ హవాలా ఛానెల్ నడిపిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగలిగారు. ఈ మొత్తం తతంగాన్ని నడిపించిన ఛీప్ ఆర్గనైజన్ షోయబ్ దేవ్‌డా, రష్యలో ఫేమస్ పబ్‌లకు వెళుతూ అక్కడివారికి ఈ ఐపీఎల్ గురించి, దానిపై బెట్టింగ్ పెడితే వచ్చే రిటర్న్స్ గురించి ప్రచారం చేసేవాడు. ఆసక్తి ఉన్నవారిని కనిపెట్టి, వారితో బెట్టింగ్ వేయించేవాడు... 

ఇలా మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రష్యన్ బెట్టింగ్ రాయుళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారట. ఫేక్ ఐపీఎల్ కథనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేల కోట్ల విలువైన ఐపీఎల్‌ని ఫేక్ చేయగలిగిన ఆ కేటుగాళ్ల తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు చాలామంది నెటిజన్లు...

మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర కూడా ఈ వార్తపై స్పందించాడు. ‘ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. దీన్ని వాళ్లు ‘మెటావర్స్ ఐపీఎల్’ అని పిలిచి ఉంటే, బిలియన్ డాలర్లు సంపాదించేవాళ్లు...’ అంటూ కామెంట్ చేశాడు ఆనంద్ మహేంద్ర...

తన వాయిస్‌ని ఇమిటేట్ చేశారని తెలిసిన క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ‘నవ్వకుండా ఉండలేకపోతున్నా... వాళ్ల కామెంటరీ తప్పకుండా ఓ సారి వినాలి...’ అంటూ ట్వీట్ చేశాడు.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే