జట్టు అక్కర్లేదు.. స్వార్థపరులు, వాళ్లలా ఆడొద్దు: భారత క్రికెటర్లపై ఇంజమామ్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Apr 23, 2020, 5:58 PM IST

టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కోసం కాకుండా కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడేవారని వ్యాఖ్యానించాడు


టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కోసం కాకుండా కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడేవారని వ్యాఖ్యానించాడు.

తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లకు, పాకిస్తాన్ క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉండేదని.. టీమిండియా క్రికెటర్లు కేవలం తమ స్థానాలను కాపాడుకోవడం కోసమే క్రికెట్ ఆడేవారని ఇంజమామ్ ఆరోపించాడు.

Latest Videos

undefined

Also Read:‘క్వారంటైన్ ప్రీమియర్ లీగ్’ ఆడేస్తున్న శిఖర్ ధావన్

ఇక పాక్ క్రికెటర్ల సంగతికి వస్తే వారు తమ జట్టు ప్రయోజనాల కోసమే క్రికెట్ ఆడేవారని.. వ్యక్తిగత రికార్డులకు దూరంగా ఉండేవారని ఇంజమామ్ అన్నాడు. భారత క్రికెటర్లు వరుస సిరీస్‌లు దృష్టిలో పెట్టుకుని ఫీల్డ్‌లోకి దిగేవారు.. ఒక సిరీస్‌లో ఆడితే మరొక సిరీస్‌లో ప్లేస్‌ ఉండేదన్నాడు.

 

ఒకవేళ ఆ సిరీస్‌లో ఫెయిల్ అయితే తదుపరి సిరీస్‌లో అవకాశం వచ్చేది కాదన్నాడు. అందుకే భారత క్రికెటర్లు ఎప్పుడూ వారి అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయేవారని ఇంజమామ్ అన్నాడు.

అయితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉండేదని.. తమ కంటే వారి బ్యాటింగ్ చాలా బలంగా ఉండేదని తెలిపారు. కాగితపు పులల తరహాలో వారు పాక్ క్రికెటర్ల కంటే స్ట్రాంగ్‌గా ఉండేవారని.. కానీ బ్యాట్స్‌మెన్‌గా తమ రికార్డు వారి కంటే మెరుగ్గా ఉండేది కాదని అంగీకరించాడు.

కానీ తాము ప్రతీ ఒక్కరం కనీసం 30 నుంచి 40 పరుగులు చేయాలనే పట్టుదలతో ఉండేవాళ్లమని ఇంజమామ్ చెప్పాడు. వాళ్లు మాత్రం కేవలం వ్యక్తిగత రికార్డుల కోసం కన్నేసేవారని.. భారత క్రికెటర్లలో ఎవరైనా సెంచరీ చేస్తే అది జట్టు కోసం కాదని, కేవలం వారి వ్యక్తిగతం కోసమేనని అతను ఆరోపించాడు.

Also Read:చిన్నారి బ్యాటింగ్ స్కిల్స్... మైకెల్ వాన్, షాయ్ హోప్ ఫిదా

టీమిండియాలోని ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో వారు పేపర్‌పై పులిగా మిలిగిపోయేవారని ఆయన అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు మన క్రికెటర్లు కూడా జట్టులో స్థానం కూడా కుస్తీలు పడుతున్నారని ఇంజమామ్ వాపోయాడు.

ఏదో ఒకటి ఆరా ఇన్నింగ్స్‌లు ఆడేసి ప్లేస్‌ సుస్థిరం చేసుకోవడం కోసం  దృష్టి పెడుతున్నారని.. కానీ మేనేజ్‌మెంట్ కోరుకునేది వారి నుంచి మంచి ప్రదర్శన అన్నాడు. భయపడుతూ క్రికెట్ ఆడొద్దని ఇంజమామ్ యువ క్రికెటర్లకు సూచించాడు. 

click me!