ఒలింపిక్స్ లో క్రికెట్....?

By Sree sFirst Published May 10, 2020, 7:18 PM IST
Highlights

క్రికెట్‌ నిర్వహణకు ఎక్కువ రోజులు పడుతుండటం ఇన్నాండ్లూ ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేర్చడానికి అడ్డంకిగా మారింది. కానీ టీ20 క్రికెట్‌తో ఒలింపిక్స్‌లో జెంటిల్‌మెన్‌ గేమ్‌పై ఆశలు రేకెత్తాయి. ఇప్పుడు 100 బాల్స్‌ సహా టీ10 ఫార్మాట్‌ సైతం ముందుకొచ్చాయి. 

1900 ఒలింపిక్స్‌లో కనువిందు చేసిన క్రికెట్‌, విశ్వ క్రీడా వేదికపై మళ్లీ కనిపించలేదు. 1998 కామన్‌వెల్త్‌ క్రీడల్లో మెరిసినా, అదీ ఆతిథి పాత్రకే పరిమితమైంది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చటంతో ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ చేర్చటంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. 

క్రికెట్‌ నిర్వహణకు ఎక్కువ రోజులు పడుతుండటం ఇన్నాండ్లూ ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేర్చడానికి అడ్డంకిగా మారింది. కానీ టీ20 క్రికెట్‌తో ఒలింపిక్స్‌లో జెంటిల్‌మెన్‌ గేమ్‌పై ఆశలు రేకెత్తాయి. ఇప్పుడు 100 బాల్స్‌ సహా టీ10 ఫార్మాట్‌ సైతం ముందుకొచ్చాయి. 

ఒలింపిక్స్‌లో టీ10 ఫార్మాట్‌ క్రికెట్‌ ఉత్తమంగా సరిపోతుందని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. టీ10 లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌కు కెప్టెన్సీ వహించిన మోర్గాన్‌ ఈ ఫార్మాట్‌ సరిగ్గా సరిపోతుందని సూచించాడు. 

' 50, 20 ఓవర్ల ఫార్మాట్‌తో టీ10 ఫార్మాట్‌ను భిన్నంగా నిలిపే అంశం సమయం. టీ10 ఫార్మాట్‌లో పూర్తి టోర్నీని కేవలం పది రోజుల్లోనే ఆడవచ్చు. 8-10 రోజుల్లో టోర్నీని ఆడితే, అది నిజంగా ఆకర్షించే అంశం. అంతకుమించి వినోదాన్ని పంచుతుంది' అని ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయం వ్యక్తపరిచాడు.

ఇకపోతే.... కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ క్రీడా రంగం కుదేలయింది. క్రికెట్ ప్రపంచ కప్ నుంచి విశ్వ క్రీడలు ఒలింపిక్స్ వరకు అన్ని కూడా వాయిదా పడడమో, లేదా రద్దవడమో జరిగాయి. ఇలా ఈ కరోనా మహమ్మారి పంజా విసరడంతో..... క్రీడాలోకమంతా చీకట్లు అలుముకున్నాయి. 

లక్ష కోట్లతో 2020 ఒలింపిక్స్‌కు రంగం సిద్ధం చేసుకున్న టోక్యో నగరం ఇప్పుడు కరోనా దెబ్బతో ఏడాది పాటు క్రీడలను వాయిదా వేసుకుంది. ఏడాది వాయిదాతో జపాన్‌ సుమారుగా 50 వేల కోట్ల అదనపు వ్యయం భరించక తప్పదు. 

ఇక ఈ కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పడిపోయాయి. ఈ గడ్డు పరిస్థితి నుంచి కోలుకునేందుకు అన్ని దేశాలకూ సుదీర్ఘ సమయం అవసరం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. 

కరోనా ప్రభావం మున్ముందు కూడా కొనసాగనున్న నేపథ్యంలో మెగా ఈవెంట్లపై స్తబ్థత కొనసాగుతోంది. అయినా, 2032 ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధమని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రకటించటం ఆసక్తిరేపుతోంది.  

click me!