James Anderson: చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్.. తొలి పేసర్​గా రికార్డు !

By Mahesh Rajamoni  |  First Published Mar 9, 2024, 11:45 AM IST

James Anderson: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధ‌ర్మ‌శాల‌లో 5వ టెస్టు జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో  700 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి పేసర్ గా ఇంగ్లాండ్ బౌల‌ర్ జేమ్స్ అండర్సన్ చ‌రిత్ర సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ ను ఔట్ చేసి అండర్సన్ ఈ ఘనత సాధించాడు.
 


England great James Anderson: ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్ జేమ్స్ అడర్సన్ చ‌రిత్ర సృష్టించాడు. 700 టెస్టు వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా ఘ‌న‌త సాధించాడు. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఆతిథ్య భారత్‌తో జరిగిన 5వ, చివరి టెస్టులో 3వ రోజు కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడంతో 41 ఏళ్ల ఈ స్టార్ బౌల‌ర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అంత‌కుముందు టెస్టు క్రికెట్ లో 700 వికెట్లు తీసిన ప్లేయ‌ర్ల లిస్టులో ఇద్ద‌రు దిగ్గ‌జ ప్లేయ‌ర్లు ఉన్నారు.

శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ (800), లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (708) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండ‌ర్స‌న్ నిలిచాడు. 2003లో ఫాస్ట్ బౌలర్ అరంగేట్రం చేసి టెస్ట్ ఫార్మాట్‌లో అగ్రగామి బౌలర్‌లలో ఒకరిగా కొనసాగుతున్న ఆండర్సన్ త‌న కెరీర్ లో ఇది మ‌రో మైలురాయి. అండర్సన్ 2015 నుండి ఇంగ్లాండ్ తరపున వైట్-బాల్ క్రికెట్ ఆడలేదు, కానీ రెడ్-బాల్ ఫార్మాట్‌లో ఫాస్ట్ బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.

Latest Videos

IPL 2024 : భువ‌నేశ్వ‌ర్ మోడలింగ్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీ చూశారా..?

గత ఏడాది యాషెస్ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు రిటైర్ అయిన తన సమీప పేస్ బౌలింగ్ ప్రత్యర్థి స్టువర్ట్ బ్రాడ్ కంటే అండర్సన్ 96 వికెట్లు ఎక్కువగా సాధించాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్ 500 వికెట్లు తీసిన త‌ర్వాత 600 నుంచి 700 వికెట్ల మైలురాళ్లను చేరుకున్న మొదటి ఫాస్ట్ బౌలర్‌గా కూడా అండర్సన్ నిలిచాడు. కేవలం 186 మ్యాచ్‌ల్లోనే తన 700వ టెస్టు వికెట్‌ను సాధించ‌డం విశేషం.

 

Another jewel in the crown of James Anderson 👑

➡️ https://t.co/NclpXwxcNa
| pic.twitter.com/JV12NGobAB

— ICC (@ICC)

ఐపీఎల్ ను అందరూ ఇష్ట‌పడేది అందుకే.. విరాట్ కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. ! 

click me!