
యూకే పర్యటనలో భారత తొలి విజయం నమోదు చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ బాది వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. భారత బ్యాటింగ్ విషయానికొస్తే శుభమన్ గిల్ 75 బంతుల్లో 80 పరుగులు చేసిన మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు, ఆక్సర్ పటేల్ 57 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 35 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్ల విషజ్ఞానికొస్తే జోఫ్రా అర్చర్, జోష్ టంగ్, సామ్ కర్రన్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. అయితే భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 47.5 ఓవర్లలోనే 258 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 76 పరుగులతో అజేయంగా నిలవగా, లియామ్ డాసన్ 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెన్ డకెట్ 43 పరుగులు చేసి మంచి ఆరంభం అందించాడు. విల్ జాక్స్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జాకబ్ బెతెల్ 14, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేశారు. అయితే హ్యారీ బ్రూక్ (1), జోస్ బట్లర్ (5), సామ్ కరన్ (0) తీవ్రంగా నిరాశపరిచారు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు వికెట్లు సాధించగా, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
Job completely done in style ✅#TeamIndia cruise to a 6️⃣-wicket victory to take a 1-0 lead in the ODI series 💙
Scorecard ▶️ https://t.co/2sg194tpxH #TeamIndia | #ENGvIND pic.twitter.com/PnUDkcVLyr— BCCI (@BCCI) July 14, 2026
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెతెల్ మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించి జట్టును బలమైన స్థితిలో నిలిపారు. డకెట్ వేగంగా పరుగులు సాధించగా, బెతెల్ నెమ్మదిగా ఆడాడు. అయితే ఈ భాగస్వామ్యం ముగిసిన వెంటనే భారత బౌలర్లు వరుస దెబ్బలు కొట్టారు. కేవలం 22 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలో పడింది.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో జో రూట్, లియామ్ డాసన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. ఏడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌ను గౌరవప్రదమైన స్కోరు దిశగా తీసుకెళ్లారు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు మరోసారి ఆధిపత్యం చెలాయించి వరుసగా వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించారు.
ఈ మ్యాచ్‌లో 41 నుంచి 50 ఓవర్ల మధ్య నాలుగు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అంతకుముందు 2013లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించాడు.