ఫైనల్ ఫైట్‌కి ముందు ఇంగ్లాండ్‌కి షాక్... ఆ కారణంగా ఈసారి వాళ్లకి కోత...

Published : Mar 20, 2021, 04:18 PM IST
ఫైనల్ ఫైట్‌కి ముందు ఇంగ్లాండ్‌కి షాక్... ఆ కారణంగా ఈసారి వాళ్లకి కోత...

సారాంశం

నాలుగో టీ20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత... మూడో టీ20లో టీమిండియాకు పడిన జరిమానా...  

7 గంటలకు ప్రారంభమయ్యే టీ20 మ్యాచ్ మామూలుగా అయితే 10:30 లోపు అయిపోవాలి. కానీ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20 ముగిసేసరికి దాదాపు 11:20 అయ్యింది.

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయడంతో స్లో ఓవర్ రేటు కింద మనోళ్లకి మ్యాచు ఫీజులో కోత పడుతుందని భావించారు చాలామంది క్రికెట్ విశ్లేషకులు. అయితే తొలి ఇన్నింగ్స్ ముగించడానికి ఆలస్యం చేసిన ఇంగ్లాండ్ జట్టుకు స్లో ఓవర్ రేటు కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది ఐసీసీ.

నిర్ణీత రేటు కంటే ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఈ ఫైన్ పడింది. మూడో టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : రూ. 220 కోట్లు గోవిందా.. బంగ్లాదేశ్ కు ఐసీసీ బిగ్ షాక్
IPL 2026 : CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 14 కోట్ల ప్లేయర్ ఔట్ !