వన్డే జట్టులో చోటు... భార్యతో కలిసి స్టెప్పులేసిన కృనాల్ పాండ్యా...

Published : Mar 19, 2021, 03:55 PM IST
వన్డే జట్టులో చోటు... భార్యతో కలిసి స్టెప్పులేసిన కృనాల్ పాండ్యా...

సారాంశం

విజయ్ హాజారే ట్రోఫీ 2021లో అద్భుతంగా రాణించిన కృనాల్ పాండ్యా... ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో చోటు... భార్యతో కలిసి ‘కజురారే’ పాటకి స్టెప్పులేసిన పాత వీడియోను పోస్టు చేసిన పాండ్యా బ్రదర్...

ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకి ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. టీమిండియా తరుపున 18 టీ20 మ్యాచులు ఆడి 14 వికెట్లతో పాటు 121 పరుగులు చేసిన కృనాల్ పాండ్యాకి ఇదే మొట్టమొదటి వన్డే సిరీస్ కానుంది.

విజయ్ హాజారే ట్రోఫీ 2021లో బరోడా కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా చేసిన పరుగులు, అతనికి వన్డే జట్టులో చోటు దక్కడానికి కారణమయ్యాయి. విజయ్ హాజారే ట్రోఫీ తర్వాత ఇంట్లోనే ఉంటున్న కృనాల్ పాండ్యా, భార్య పంకురి శర్మతో కలిసి స్టెప్పులేశాడు.

అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ఫేమస్ పాట ‘కజురారే’ పాటకు భార్యభర్తలిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ‘నన్ను ఎక్కువగా సంతోషపెట్టేది ఏంటి... కలిసి డ్యాన్స్ చేయడం’ అంటూ డ్యాన్స్ వీడియోను పోస్టు చేశాడు కృనాల్ పాండ్యా. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !