ENG vs SA: వీర విధ్వంసక ఇంగ్లాండ్.. సఫారీ బౌలర్లను చీల్చి చెండాడిన బట్లర్ గ్యాంగ్

Published : Jul 28, 2022, 12:58 AM IST
ENG vs SA: వీర విధ్వంసక ఇంగ్లాండ్.. సఫారీ బౌలర్లను చీల్చి చెండాడిన బట్లర్ గ్యాంగ్

సారాంశం

ENG vs SA T20I: వన్డే సిరీస్ లో ఆశించిన మేర రాణించకపోవడంత ఢీలా పడ్డ ఇంగ్లాండ్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో మాత్రం జూలు విదిల్చింది. 

ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికాల మధ్య బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఆతిథ్య జట్టు భారీ స్కోరు చేసింది. గడిచిన నెలరోజులుగా అనుకున్న స్థాయిలో రాణించలేక చతికిలపడుతున్న ఇంగ్లీష్ జట్టు.. సఫారీల బౌలింగ్ ను చీల్చి చెండాడింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (53 బంతుల్లో 90, 3 ఫోర్లు, 8 సిక్సర్లు)కు తోడు మోయిన్ అలీ (18 బంతుల్లో 52, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) దుమ్మురేపారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ జోస్ బట్లర్ 7 బంతుల్లోనే 2 బౌండరీలు, 2 సిక్సర్లతో  22 పరుగులు చేశాడు. కానీ అతడిని లుంగి ఎంగిడి 2.4 ఓవర్లో ఔట్ చేశాడు. తన తర్వాత ఓవర్లో ఎంగిడి.. జేసన్ రాయ్ (8) ను కూడా పెవిలియన్ కు పంపాడు. 

ఈ క్రమంలో డేవిడ్ మలన్ (23 బంతుల్లో 43, 1 ఫోర్, 4 సిక్సర్లు) కు జతకలిసిన బెయిర్ స్టో..  వీరవిహారం చేశాడు. కాసేపటికే మలన్ నిష్క్రమించినా మోయిన్ అలీ రాకతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దొరికిన బంతిని దొరికనట్టుగా సిక్సర్లతో చెలరేగాడు అలీ.. ముఖ్యంగా స్టబ్స్ వేసిన 16వ ఓవర్లో అలీ, బెయిర్ స్టో లు20 పరుగులు, 17వ ఓవర్ వేసిన పెహ్లుక్వాయో బౌలింగ్ లో 33 పరుగులు రాబట్టారు. ఎంగిడి వేసిన 18వ ఓవర్లో కూడా 17 పరుగులొచ్చాయి.

 

ఎంగిడి వేసిన ఈ ఓవర్లో సిక్సర్ కొట్టి  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ.. ఇంగ్లాండ్ తరఫున  అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 16 బంతుల్లోనే అతడు 50 పరుగులు పూర్తి చేశాడు.  ధాటిగా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ చివర వికెట్లు కోల్పోయినా భారీ స్కోరును చేయగలిగింది. మరి ఈ కొండను సఫారీలు కరిగించగలరా..? అనేది వేచి చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

Interesting Facts : కోట్లు సంపాదించే క్రికెటర్లు చిరిగిన షూస్ ఎందుకు వేసుకుంటారో తెలుసా..?
Most Sixes : ఈ ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదింది ఎవరో తెలుసా..? మీరు అస్సలు ఊహించి ఉండరు