INDvsENG: 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఫాలోఆన్‌కి ఇంకా 24 పరుగుల దూరంలో...

Published : Feb 14, 2021, 02:19 PM IST
INDvsENG: 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఫాలోఆన్‌కి ఇంకా 24 పరుగుల దూరంలో...

సారాంశం

నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... రెండు కీలక వికెట్లు తీసిన అక్షర్ పటేల్... 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు...  

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. టీ బ్రేక్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది ఇంగ్లాండ్. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పులు పెట్టగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

సిరాజ్, ఇషాంత్ శర్మలకు చెరో వికెట్ దక్కింది. 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును మొయిన్ ఆలీ, బెన్ ఫోక్స్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేసి 18 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడిని, అక్షర్ పటేల్ విడగొట్టాడు.

30 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓల్లీ స్టోన్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయడంతో 106 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 223 పరుగులు వెనకబడి ఉన్న ఇంగ్లాండ్, ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 24 పరుగులు చేయాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా