రెప్ప పాటులో సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్.. మళ్లీ ఇలాంటి సీన్ కనిపించదేమో, వీడియో వైరల్

Siva Kodati |  
Published : Feb 25, 2023, 08:33 PM ISTUpdated : Feb 25, 2023, 08:34 PM IST
రెప్ప పాటులో సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్.. మళ్లీ ఇలాంటి సీన్ కనిపించదేమో, వీడియో వైరల్

సారాంశం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

వెల్లింగ్టన్‌లో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే కొత్త కుర్రాడు బ్రూక్ వీర విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాడు ఓలీ పోప్ సంచలన క్యాచ్ పట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌‌లో జాక్ లీచ్ వేసిన 25వ ఓవర్‌‌లో నికోల్స్ రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే షార్ట్ సెలక్షన్‌ రాంగో లేక.. బంతి గింగిరాలు తిరిగిందో కానీ అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని బాల్ అతడి హెల్మెట్‌కు తాకి సిల్లీ పాయింట్ దిశగా వెల్లింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న పోప్ సింగిల్ హ్యాండ్‌తో బంతిని దొరక బుచ్చుకున్నాడు. దీనిని ఊహించని నికోల్స్ (30) నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో కీవీస్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అంతకముందు ఇంగ్లాండ్ 87.1 ఓవర్లలో 435 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 

ALso REad: 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనత.. దిగ్గజాలను దాటేశాడుగా

ఇకపోతే.. ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ అరుదైన ఘనత సాధించాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 9 ఇన్నింగ్స్‌ల్లో 8 వందలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు 9 ఇన్సింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (798) రికార్డును బద్ధలు కొట్టారు. వినోద్ కంటే ముందు హెర్బర్ట్ సుట్ల్కిఫ్ (780), సునీల్ గావస్కర్ (778), ఎవర్టన్ వీకెస్ (777) వున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడుతోంది. రెండో టెస్టులో హ్యారీ 184 పరుగులతో వున్నాడు. మరోవైపు జో రూట్ (101) కూడా సెంచరీ బాదేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 294 పరుగులు జోడించారు. 

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !