
తొలి టెస్టు విజయంతో ఘనంగా టీమిండియా టూర్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్... ఈ పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20 మ్యాచులతో పాటు మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే. తాజాగా టీ20 సిరీస్ కోసం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.
టెస్టు టీమ్‌లో లేని ఇయాన్ మోర్గాన్,ఇంగ్లాండ్ టీ20 జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా... టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్‌కి టీ20 జట్టులో చోటు దక్కలేదు. టీ20 టాప్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్‌తో పాటు బీబీఎల్‌లో దుమ్మురేపిన లివింగ్ స్టోన్, సామ్ బిల్లింగ్స్ వంటి ప్లేయర్లు టీ20 సిరీస్ కోసం ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు. వీరితో పాటు జేక్ బాల్, మాట్ పార్కిన్సన్ రిజర్వు ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
టీ20 సిరీస్‌కి ఇంగ్లాండ్ జట్టు ఇది:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ ఆలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, బట్లర్, సామ్ కుర్రాన్, టామ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, టాప్లీ, వుమ్