చాహల్ భార్యతో చిందేసిన శ్రేయాస్ అయ్యర్

Published : Feb 11, 2021, 07:35 AM IST
చాహల్ భార్యతో చిందేసిన శ్రేయాస్ అయ్యర్

సారాంశం

పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైక్‌లు సాధించిన ఈ వీడియోను టీమిండియా ఆటగాళ్లు చాహల్‌, లోకేశ్‌ రాహుల్‌, మయాం‍క్‌ అగర్వాల్‌, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు తెగ మెచ్చుకున్నారు. 

టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ డ్యాన్స్ లతో అదరగొట్టాడు. అది కూడా సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ తో కలిసి డ్యాన్స్ చేయడం గమనార్హం. ‘రోజస్’ అనే పాటకు వీరిద్దరూ డ్యాన్స్ వేయడం గమనార్హం. కాగా.. ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియోని అయ్యర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైక్‌లు సాధించిన ఈ వీడియోను టీమిండియా ఆటగాళ్లు చాహల్‌, లోకేశ్‌ రాహుల్‌, మయాం‍క్‌ అగర్వాల్‌, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు తెగ మెచ్చుకున్నారు. వీరిద్దరి డ్యాన్స్‌ మూమెంట్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వీడియోలో ధనశ్రీ హావభావలకు నెటిజన్లు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఓ ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌తో పోలుస్తూ ఆకాశానికెత్తారు. 

ఇదివరకే యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ధనశ్రీ.. తాజా వీడియోతో మరింత పాపులారిటిని సొంతం చేసుకుంది. కాగా, ధనశ్రీ వర్మను చాహల్‌ గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఓ పక్క ధనశ్రీ యూట్యూబ్‌ వేదికగా డ్యాన్స్‌లతో అదరగొడుతుంటే, మరో పక్క చాహల్‌ తన మణికట్టు మాయాజాలంతో టీమిండియాకు మరపురాని విజయాలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చాహల్‌ కూడా తన పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను నడిపిస్తున్నప్పటికీ.. దాన్ని కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం చేశాడు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !