ఔట్ అయ్యాననే కోపంతో.. బ్యాట్ నేలకేసి కొట్టిన ఇంగ్లాండ్ క్రికెటర్

By telugu news teamFirst Published Sep 4, 2021, 9:11 AM IST
Highlights

సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో ఓలీ పోప్ బాగా నిరాశకు గురయ్యాడు. దీంతో.. కోపంతో బ్యాట్ నేలకేసి కొట్టాడు. 

టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండో టెస్టు మ్యాచ్ ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్టులో ఘోర ఓటమిని చవిచూసింది. ఇక నాలుగో టెస్టులో  టీమిండియా తొలుత తడపడినా.. ఆ తర్వాత తేరుకోని నిలపడ్డారు. ఇంగ్లాండ్ క్రికెటర్ల ఆటకట్టిస్తున్నారు.

ఈ క్రమంలో.. ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీ పోప్‌ సెంచరీ దిశగా వెళ్తుంటే.. అడ్డుకట్ట వేశారు.  81 పరుగులు చేసి.. సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో.. ఓలీ పోప్ ని ఔట్ చేశారు. అయితే.. సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో ఓలీ పోప్ బాగా నిరాశకు గురయ్యాడు. దీంతో.. కోపంతో బ్యాట్ నేలకేసి కొట్టాడు. 

 

Shardul Thakur chops on Ollie Pope, Shardul delivers when the team required. pic.twitter.com/PAlyHcWvue

— Mufaddal Vohra (@mufaddal_vohra)

దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇన్నింగ్స్‌ 77వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. శార్ధూల్‌ ఠాకూర్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతికే పోప్‌ ఔటయ్యాడు. శార్దూల్‌ వేసిన బంతిని పోప్‌ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి ఇన్నర్‌ ఎడ్జ్‌తో వికెట్లను గిరాటేసింది. దీంతో కోపం పట్టలేక బాధతో తన బ్యాట్‌ను నేలకేసి కొడుతూ నిరాశగా వెనుదిరిగాడు.

ఇక పోప్‌ కీలక సమయంలో రాణించడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పోప్‌ బెయిర్‌ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బెయిర్‌ స్టో, మొయిన్‌ అలీలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. క్రిస్‌ వోక్స్‌ 28, జేమ్స్‌ అండర్సన్‌ 1 పరుగుతో క్రీజులో ఉ‍న్నారు.

click me!