ind vs eng: శార్దూల్ ఠాకూర్ మెరుపులు.. ట్విట్టర్ లో ప్రశంసల జల్లు..!

Published : Sep 03, 2021, 10:32 AM ISTUpdated : Sep 03, 2021, 10:37 AM IST
ind vs eng: శార్దూల్ ఠాకూర్ మెరుపులు.. ట్విట్టర్ లో ప్రశంసల జల్లు..!

సారాంశం

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా.. జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో.. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్  ఊహించని విధంగా అధరగొట్టాడు.

టీమిండియా యువ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన బ్యాటింగ్ తో మెరుపులు కురిపించాడు.  ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా.. జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో.. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్  ఊహించని విధంగా అధరగొట్టాడు.

ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అర్థ సెంచరీతో అదరగొట్టేశాడు. అత్యంత తక్కువ స్కోర్ తో టీమిండియా ఆల్ అవుట్ అవుతుందని అభిమానులంతా కలవరపడ్డారు. కానీ.. శార్దూల్ జట్టును కాపాడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లతో చెలరేగిపోయిన శార్ధూల్ ఠాకూర్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. అప్పటికే మూడు వికెట్లు పడగొట్టిన క్రిస్‌వోక్స్‌కి బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో స్వాగతం పలికిన ఠాకూర్.. ఆ తర్వాత క్రైగ్ ఓవర్టన్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదేశాడు. 

 

లెంగ్త్ బాల్‌ని క్రీజులో నిల్చొనే మిడాఫ్ దిశగా శార్ధూల్ స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ క్రిస్‌వోక్స్‌ని టార్గెట్ చేసిన శార్ధూల్.. బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు. మధ్యలో రాబిన్సన్ బౌలింగ్‌లో శార్ధూల్ ఇచ్చిన క్యాచ్‌ని కీపర్ బెయిర్‌స్టో జారవిడిచాడు. ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన రాబిన్సన్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన శార్ధూల్ ఠాకూర్.. కెరీర్‌లో రెండో టెస్టు హాఫ్ సెంచరీని అందుకున్నాడు.

కాగా.. శార్దూల్ ఆటకు అభిమానులు మంత్ర ముగ్దులైపోయారు. అందుకే.. ట్విట్టర్ వేదికగా.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  టీమిండియాకి మరో ఆణిముత్యం దొరికాడంటూ.. పొగిడేస్తున్నారు. ట్విట్టర్ మొత్తం శార్దూల్ పేరుతో హోరెత్తిపోతుండటం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా