ఇండియాతో టీ20, వన్డేలకు జట్లను ప్రకటించిన ఇంగ్లాండ్.. పొట్టి ఫార్మాట్ లో కీలక ఆల్ రౌండర్ కు విశ్రాంతి

By Srinivas MFirst Published Jul 1, 2022, 7:16 PM IST
Highlights

ENG vs IND: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఎడ్జబాస్టన్ లో టెస్టు ముగిసిన తర్వాత  ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జట్లను ప్రకటించింది. 
 

ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న  తొలి టెస్టు ముగిసిన రెండ్రోజులకే  ఇంగ్లాండ్.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది.  జులై 7 నుంచే టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీ20, వన్డేలు ఆడబోయే జట్లను ఈసీబీ ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్  వైట్  బాల్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో జోస్ బట్లర్ ఇంగ్లాండ్ ను నడిపించబోతున్నాడు.  

టీ20, వన్డే సిరీస్ జట్టును ప్రకటించిన  ఈసీబీ సంచలనాలకు తావివ్వకుండా నెదర్లాండ్ తో ఆడిన ఆటగాళ్లకే తిరిగి ఛాన్సిచ్చింది. కాగా వన్డే జట్టులో ప్రముఖ ఆల్ రౌండర్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్,  మాజీ సారథి జో రూట్ తిరిగి జట్టుతో చేర్చారు. 

కానీ టీ20 లకు మాత్రం బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇటీవలే న్యూజిలాండ్ తో వరుసగా మూడు టెస్టులు ఆడిన స్టోక్స్.. ఇండియాతో మ్యాచ్ కూడా ఆడుతున్నాడు. దీంతో అతడికి టీ20 ల నుంచి విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. కానీ స్టోక్స్ వన్డే జట్టుతో కలుస్తాడు. ఇక స్పిన్నర్ అదిల్ రషీద్ స్థానంలో లంకాషైర్ బౌలర్ రిచర్డ్ గ్లెసన్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే ముగిసిన టీ20 బ్లాస్ట్ లో గ్లెసన్.. 12 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి  ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఇక వన్డే జట్టులో నెదర్లాండ్స్ తో అదరగొట్టిన డేవిడ్ మలన్ కు చోటు దక్కకపోవడం గమనార్హం. అలాగే టీ20 లో మెరుపులు మెరిపించే బెయిర్ స్టో కు కూడా టీ20లలో విశ్రాంతినివ్వగా.. వన్డేలలో చోటు దక్కింది. 


ఇండియాతో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, రిచర్డ్ గ్లెసన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీచ్ టోప్లే, డేవిడ్ విల్లే 

వన్డే జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, జొనాథన్ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కరన్, లియామ్ లివింగ్ స్టోన్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, జో రూట్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీచ్ టోప్లే, డేవిడ్ విల్లే 

 

Our squad for the three-match ODI series with ! 🧢

More here: https://t.co/oLGb3baHyu

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 🇮🇳 pic.twitter.com/SpVsDND6QO

— England Cricket (@englandcricket)

ఇండియా-ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ : 

- జులై 7 : తొలి టీ20  - సౌతంప్టన్ 
- జులై 9 : రెండో టీ20 - బర్మింగ్హోమ్ 
- జులై 10 : మూడో టీ20 - నాటింగ్హోమ్ 
- జులై 12 : తొలి వన్డే - ఓవల్, లండన్ 
- జులై 14 : రెండో వన్డే - లార్డ్స్, లండన్ 
- జులై 17 : మూడో వన్డే - మాంచెస్టర్ 
 

Our squad to take on in the three-match IT20 series 💥

More here: https://t.co/UumWQ5m7xa

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 🇮🇳 pic.twitter.com/ZNqEtmHNZC

— England Cricket (@englandcricket)
click me!