బ్రుమ్ బా.. బ్రుమ్ బా.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ పేరు మార్చిన బుడ్డోడు.. క్యూట్ వీడియో

Published : Jul 01, 2022, 06:23 PM IST
బ్రుమ్ బా.. బ్రుమ్ బా.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ పేరు మార్చిన బుడ్డోడు..  క్యూట్ వీడియో

సారాంశం

IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు జస్ప్రిత్ బుమ్రా. భూమ్ భూమ్ బుమ్రా గా ప్రసిద్ధి చెందిన ఈ పేసర్ పేరును ఓ బుడ్డోడు విచిత్రంగా పలుకుతున్నాడు. 

ఏడాది కాలంగా సాగిన నిరీక్షణ ఎట్టకేలకు తీరింది.  గతేడాది కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియా-ఇంగ్లాండ్ ఐదో టెస్టు.. ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్నది. టీమిండియా  రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడటంతో అతడి స్థానంలో యువ పేసర్ జస్ప్రిత్ బుమ్రా భారత జట్టును నడిపిస్తున్నాడు. అయితే అతడి పేరును  ఓ బుడ్డోడు తన క్యూట్ మాటలతో చిత్ర విచిత్రంగా పిలుస్తున్నాడు. 

పక్కన కూర్చున్న వ్యక్తి బుమ్రా.. బుమ్రా అని అరుస్తుండగా.. ఈ బుడ్డోడు మాత్రం బ్రుమ్ బా.. బ్రుమ్ బా అంటూ  బిగ్గరగా అంటున్నాడు.  ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘మేమంతా నిన్ను ఉత్సాహపరుస్తున్నాం బుమ్రా..’ అని  పోస్టులో రాసుకొచ్చింది. 

కాగా ఈ బుడ్డోడి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా క్యూట్ గా ఉన్నాడు.. బ్రుమ్ రా..’ ‘ఇది బ్రుమ్ రా క్రేజ్..’ ‘టీమిండియా కొత్త కెప్టెన్ కు చిన్న పిల్లల స్వాగతం..’ అని కామెంట్ చేస్తున్నారు.

 

తొలి టెస్టుకు వర్షం అడ్డంకి..

ఇదిలాఉండగా తొలి టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్ (17), ఛతేశ్వర్ పుజారా (13) లు ఓపెనర్లుగా వచ్చి ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఈ ఇద్దరూ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లోనే నిష్క్రమించారు.  17 ఓవర్లలో భారత్.. 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హనుమా విహారి (14 నాటౌట్), విరాట్ కోహ్లి (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  కాగా లంచ్ కు కొద్దిసేపటి ముందు వరుణుడు మ్యాచ్ ను అడ్డుకున్నాడు.  లంచ్ ముగిసి వాన తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ సాధ్యపడటం లేదు. 

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !