
తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు, ఒకరోజు ముందే రెండో టెస్టు జట్టును ప్రకటించింది. మొదటి టెస్టులో అదరగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు విశ్రాంతి కల్పిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.
తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన డామ్ బెస్‌కి విశ్రాంతి కల్పించిన ఇంగ్లాండ్, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్‌లను బెంచ్‌కి పరిమితం చేసింది. 38 ఏళ్ల జేమ్స్ అండర్సన్‌కి విశ్రాంతినిస్తామని ముందుగానే ప్రకటించింది ఇంగ్లాండ్.
అయితే ఆర్చర్ గాయపడడంతో అతని స్థానంలో అండర్సన్ ఆడతాడని భావించారంతా. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం అండర్సన్‌కి రెస్టు ఇచ్చాడు. తొలి టెస్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఫోక్స్, మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్, స్టోన్, బ్రాడ్ రెండో టెస్టులో బరిలో దిగబోతున్నారు.
రెండో టెస్టులో పాల్గొనబోయే 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. టీమిండియాతో రెండో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు ఇది:
జో రూట్ (కెప్టెన్), సిబ్లీ, రోరీ బర్న్స్, లారెన్స్, బెన్ స్టోక్స్, పోప్, ఫోక్స్, మొయిన్ ఆలీ, జాక్ లీచ్, క్రిస్ వోక్స్, స్టోక్, స్టువర్ట్ బ్రాడ్