పాకిస్తాన్ ఎదుట భారీ లక్ష్యం నిలిపిన ఇంగ్లాండ్.. స్పిన్ పిచ్‌పై సాధ్యమేనా..?

Published : Dec 11, 2022, 12:17 PM IST
పాకిస్తాన్ ఎదుట భారీ లక్ష్యం నిలిపిన ఇంగ్లాండ్.. స్పిన్ పిచ్‌పై సాధ్యమేనా..?

సారాంశం

PAKvsENG 2nd Test: ముల్తాన్ వేదికగా జరుగుతున్న  రెండో టెస్టులో పాకిస్తాన్ ఎదుట ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని నిలిపింది.  స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై పాక్ బ్యాటర్లు ఏ మేరకు నిలువగలుగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

పాకిస్తాన్ తో  జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 275 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను కోల్పోయి మూడో రోజు  ఆట  ఆరంభించిన ఇంగ్లాండ్.. లంచ్ కు ముందే మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది.  ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో దెబ్బకొట్టిన అబ్రర్ అహ్మద్ తో పాటు జహీద్ మహ్మద్ లు మరోసారి ఇంగ్లీష్ ఆటగాళ్లను నిలువరించారు.  సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్..  64.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయింది.  ఫలితంగా పాకిస్తాన్ ఎదుట  355 పరుగుల టార్గెట్ ను నిలిపింది. 

తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 281 పరుగులకు ఆలౌట్ కాగా  పాకిస్తాన్ 202 పరుగులకే  చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన ఇంగ్లాండ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసిన అబ్రర్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా నాలుగు వికెట్లు (మొత్తంగా అరంగేట్ర టెస్టులోనే 11 వికెట్లు) తీసి  అదరగొట్టాడు.

ఆ జట్టు తరఫున హ్యారీ బ్రూక్ (108) సెంచరీతో రాణించగా బెన్ డకెట్ (79), బెన్ స్టోక్స్ (41) లు రాణించారు.   తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో చెలరేగిన  అబ్రర్ అహ్మద్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నాలుగు వికెట్లు తీశాడు.  డకెట్, విల్ జాక్స్,  జో రూట్, రాబిన్సన్ వికెట్లు అతడికే దక్కాయి. హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్ వికెట్లు  జహీద్ తీశాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ రెండుసార్లు ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసినా ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా వికెట్ తీయలేదు. రెండు ఇన్నింగ్స్ లలోనూ స్పిన్నర్లదే  హవా. తొలి ఇన్నింగ్స్ లో  ఇంగ్లాండ్ స్పిన్నర్ తో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్  జో రూట్ కూడా ముల్తాన్ లో  బంతిని మెలికలు తిప్పాడు.   

 

మరి స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై  పాక్ ఆటగాళ్లు  ఏ మేరకు నిలబడగలుగుతారనేది ఆసక్తికరం. ఇంగ్లాండ్ మరోసారి జాక్ లీచ్ మీదే ఆశలు పెట్టుకుంది.  ఈ టెస్టులో ఇంకో రెండు రోజులు మిగిలున్నాయి.  దీంతో   వర్షం వస్తే తప్ప ఫలితం తేలడం  సులువే.  భారీ లక్ష్య ఛేదనలో  పాకిస్తాన్.. రెండో ఇన్నింగ్స్ లో  10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా  43 పరుగులు చేసింది.  మహ్మద్ రిజ్వాన్ (23 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !