స్టార్ స్పోర్ట్స్‌కి చెక్! టీమిండియా బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సొంతం చేసుకున్న జియో...

Published : Aug 31, 2023, 05:28 PM ISTUpdated : Sep 21, 2023, 11:44 AM IST
స్టార్ స్పోర్ట్స్‌కి చెక్! టీమిండియా బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సొంతం చేసుకున్న జియో...

సారాంశం

11 ఏళ్లుగా టీమిండియా మ్యాచులను ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌...సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకూ డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకున్న వయాకాం.. 

వచ్చే ఐదేళ్లకు బీసీసీఐ మీడియా హక్కులను వయాకాం18 సొంతం చేసుకుంది. టీవీ రైట్స్‌తో డిజిటల్స్ రైట్స్ కూడా వయాకాం18 దక్కించుకున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించాడు. 2023 నుంచి 2028 వరకూ జరిగే అంతర్జాతీయ క్రికెట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించిన ఒక్కో మ్యాచ్ కోసం రూ.67.8 కోట్లు చెల్లించేందుకు వయాకాం18 కోట్ చేసినట్టు సమాచారం.

ఐపీఎల్‌తో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హక్కులు కూడా వయాకాం దగ్గరే ఉన్నాయి. టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచులకు సంబంధించిన మ్యాచులు జియో సినిమా యాప్‌లో, స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేయనుంది వయాకాం18. అలాగే ఐపీఎల్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న వయాకాం, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ఒలింపిక్స్ 2024 పోటీలను కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది..

టీ10 లీగ్‌తో పాటు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, సౌతాఫ్రికా20, ఎన్‌బీఏ, లా లీగా, లీగ్1, డైమండ్ లీగ్.. ఇలా అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మేజర్ పోటీలన్నీ జియో సినిమా యాప్‌లో ప్రసారం కానున్నాయి. 

‘వచ్చే ఐదేళ్లకు బీసీసీఐ లీనర్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న వయాకాం18కి కంగ్రాట్స్. ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత క్రికెట్ దినదినాభివృద్ధి చెందుతోంది. మీడియా రైట్స్‌తో బీసీసీఐ, వయాకాం అనుబంధం మరింత పెరిగింది. క్రికెట్ ఫ్యాన్స్‌కి అద్భుత అనుభవం ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం. గత కొన్నేళ్లుగా స్టార్ ఇండియా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఇచ్చిన సపోర్ట్‌కి ధన్యవాదాలు. భారత క్రికెట్‌ని గ్లోబల్ లెవెల్‌లో తీసుకెళ్లడంలో మీ పాత్ర మరువలేనిది...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
11 ఏళ్లుగా టీమిండియా మ్యాచులను ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కి జియో ఊహించని షాక్ ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ రెండూ కూడా క్రికెట్‌కి దూరం కాబోతున్నాయి..

సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకూ టీమిండియా మొత్తంగా స్వదేశంలో 88 నుంచి 102 మ్యాచులు ఆడనుంది.  ఇందులో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచులు ఉంటాయి. బీసీసీఐ మీడియా హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో పాటు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ పోటీపడినా... భారీ ధరను కోట్ చేసిన వయాకాం18 హక్కులను దక్కించుకుంది.

2018లో డిస్నీ స్టార్ రూ.6,138 కోట్లకు టీమిండియా మ్యాచుల ప్రసార హక్కులను చెల్లించింది. డిస్నీ మ్యాచ్‌కి రూ.60 కోట్లు చెల్లించగా, ఇప్పుడు ఆ విలువ రూ.67.8 కోట్లకు చేరింది.  

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !