Asia Cup 2023 Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్ పై ఫ్యాన్స్ కు చేదువార్త

Published : Aug 31, 2023, 12:45 PM ISTUpdated : Aug 31, 2023, 12:50 PM IST
Asia Cup 2023 Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్ పై ఫ్యాన్స్ కు చేదువార్త

సారాంశం

ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ విషయంలో క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు.

కాండీ: ఏషియా కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దాయాదుల మధ్య పోరును వీక్షించడానికి అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఏషియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన కాండీ వేదికగా పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

మ్యాచ్ జరగాల్సిన సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు గంటల వ్యవధిలో అమ్ముడుపోయాయి. అంతేకాకుండా సెప్టెంబర్ 4వ తేదీన భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం కావచ్చునని అంచనా వేస్తున్నారు.

also Read: నేపాల్‌పై ప్రతాపం చూపించిన పాకిస్తాన్... ఆసియా కప్ 2023 టోర్నీలో బోణీ...

ఈ ఏడాది ఆసియా కప్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలుగా హైబ్రిడ్ నమూనాలో జరుగుతున్నాయి. ఈ టోర్నమెంటులో 13 మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో నాలుగు మ్యాచ్ లు పాకిస్తాన్ లో, మిగిలిన తొమ్మిది మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లో నేపాల్ మీద పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ ఏషియా కప్ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. పాకిస్తాన్ లోని ముల్తాన్ వేదిక ఈ మ్యాచ్ జరిగింది. నేపాల్ మీద పాకిస్తాన్ 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, బ్యాటర్ ఇఫ్తెకార్ సెంచరీలతో చెలరేగిపోయారు. పాకిస్తాన్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో నేపాల్ చతికిలపడింది. నేపాల్ బౌలర్లు పాకిస్తాన్ బౌలర్లను తొలుత కట్టడి చేసినప్పటికీ, ఆ తర్వాత బాబర్ ఆజం, ఇఫ్తెకార్ చెలరేగిపోయారు. నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 

ఆసియా కప్ భారత జట్టు ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్ దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ క్రిష్ణ

రిజర్వ్ ఆటగాడు: సంజూ శాంసన్

తొలి రెండు మ్యాచ్ ల్లో కెఎల్ రాహుల్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను ఆడిస్తారా అనేది చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !