ధోని జెర్సీనే మార్చేసిన పాక్ అభిమాని

By Arun Kumar PFirst Published May 25, 2019, 5:32 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. కూల్ కెప్టెన్సీ, ధనాధన్ బ్యాటింగ్,  మ్యాచ్ పినిషింగ్, తనదైన స్టైల్లో సూపర్ వికెట్ కీపింగ్...ఇలా అతడి ప్రమేయం లేకుండా టీమిండియా మ్యాచ్ గెలిచిన సందర్భాలు చాలా అరుదని చెప్పాలి. ఇలా తన ఆటతీరుతో స్వదేశీ అభిమానులనే కాదు విదేశీ అభిమానులను కూడా అతడు సంపాదించుకున్నాడు. అతడు తన కెరీర్ ఆరంభంలోనే అద్భుత ఆటతీరుతో ఏకంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ చేతే ప్రశంసలు పొందాడంటేనే అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రపంచ కప్ నేపథ్యంలో ఓ పాక్ అభిమాని విచిత్రమైన రీతిలో ధోనిపై అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఎవరైనా పాక్ జెర్సీపై ధోని పేరు చూస్తామని అనుకున్నామా?  ఓ పాకిస్థానీ అభిమాని మాత్రం తమ దేశ  జెర్సీపై ధోని పేరు వుండాలని అనుకున్నాడు. అయితే ఆ అసాధ్యాన్ని  తానే సుసాధ్యం చేయాలనుకున్నాడు. ఇంకేముంది ధోని పేరుతో పాక్ జెర్సీని తయారుచేయించుకున్నాడు. సేమ్ టీమిండియా జెర్సీపై ధోని ఉపయోగించే లక్కీ నెంబర్ 7 ను కూడా దానిపై వేయించి ముచ్చట తీర్చుకున్నాడు. 

ఇలా ధోని పేరుతో వున్న పాక్ జెర్సీ  ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. '' క్రికెటర్లకు, క్రికెట్ కు మాత్రమే ఎల్లలు...మా అభిమానులకు కాదు'' అని  కొందరు, '' ధోని  భారత క్రికెటర్ మాత్రమే కాదు...ప్రపంచ స్థాయి క్రికెటర్. అందువల్లే అతడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు'' అంటూ మరికొందరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు. ఇలా  సోషల్ మీడియాలో ధోని జెర్సీతో మొదలైన చర్చ వివిధ విషయాలపై కొనసాగుతోంది.  

click me!