
ధోని రిటైర్మెంట్... ప్రస్తుతం భారత క్రీడా ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన అంశం. ప్రపంచ కప్ తర్వాత అతడి రిటైర్మెంట్ ప్రకటన వుంటుందని అందరూ భావించారు. కానీ ఈ మెగా టోర్నీ ముగిసి వెస్టిండిస్ పర్యటన కోసం భారత జట్టు సెలెక్షన్ ప్రక్రియ ప్రారంభమైన అతడి రిటైర్మెంట్ పై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ధోని మరికొంత కాలం కెరీర్ కొనసాగిస్తాడా..? లేక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ డైలమాలో ఉన్నాడా...? అనే విషయాలు తెలీక అభిమానులే కాదు బిసిసిఐ, సెలెక్షన్ కమిటీ కూడా డైలమాలో వుంది.
విండీస్ పర్యటనకు ధోని దూరం...ఎందుకంటే
అయితే తాజాగా ధోని పరోక్షంగా తన రిటైర్మెంట్ కు మరింత కాలం సమయముందని చెప్పకనే చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో తాను బిజీగా వున్నందున వెస్టిండిస్ సీరిస్ కు అందుబాటులో వుండనని ధోని నుండి సమాచారం వచ్చిందని ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. అందువల్ల తనను ఈ సీరిస్ కోసం పరిగణలోకి తీసుకోవద్దని ధోని తెలిపాడట.
ఇలా ధోని వెస్టిండిస్ పర్యటనకు దూరంగా వుంటానని తెలపడం ద్వారా రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చినట్లయింది. క్రికెట్ కు దూరమయ్యే ఉద్దేశమే వుంటే ఇలా విండీస్ సీరిస్ కు తన పేరును పరిగణించవద్దని చెప్పేవాడు కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడు విండీస్ పర్యటన తర్వాత మళ్లీ భారత జట్టులో కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
బిసిసిఐ అధికారి ఏమన్నాడంటే
''ధోని భారత ఆర్మీ విభాగంలో ఉద్యోగాన్ని కలిగివున్న విషయం తెలిసిందే. అయితే అతడు రెండు నెలల పాటు పారామిలిటరీ రెజిమెంట్ లో సైనికులతో పాటు గడపాలని భావిస్తున్నాడు. అందువల్ల వెస్టిండిస్ సీరిస్ కు అందుబాటులో వుండనని తమకు సమాచారం అందించాడు.'' అని సదరు బిసిసిఐ అధికారి వెల్లడించాడు.
ఆదివారం భారత సెలక్షన్ కమిటీ విండీస్ సీరిస్ కోసం జట్టును ఎంపికచేయనుంది. ఇందుకోసం ముంబై లో సమావేశం కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున ధోని ముందుగానే బిసిసిఐ, సెలెక్షన్ కమిటీకి సమాచారం అందించాడు.
సంబంధిత వార్తలు
ధోనీ రిటైర్మెంట్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్
‘‘ధోనీకి ప్రత్యామ్నాయమా..? వాళ్లు కూడా విమర్శించేవారే’’
ప్రస్తుత సెలక్షన్ కమిటీకీ మేమిచ్చే సలహా ఇదే: ధోని రిటైర్మెంట్ పై మాజీ సెలెక్టర్లు
వరల్డ్ కప్ ఎఫెక్ట్... విండీస్ పర్యటనకు ధోనీ దూరం..?