
IND vs ENG : ధర్మ శాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపాడు. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు శుభారంభం చేయడంతో భారత్ రెండో రోజు అధిక్యంతో ముందుకు సాగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో కెరీర్ లో 12 సెంచరీ సాధించాడు. 154 బంతుల్లో సెంచరీ కొట్టగా, తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ సెంచరీ కొట్టాడు.
ధర్మశాలలో భారత్-ఇంగ్లాండ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో సూపర్ సిక్స్ తో సెంచరీ కొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీని పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్ కెరీర్ లో వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఇది 4వ సెంచరీ. ఈ సిరీస్ లో రెండో సెంచరీ కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 11వ సెంచరీ.
Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ సాధించలేదని జైస్వాల్ చేశాడు..
సెంచరీ చేసిన వెంటనే శుభ్‌మన్ గిల్ తన టోపీని తీసి తన బ్యాట్‌ను ఊపుతూ తన ట్రేడ్‌మార్క్ 'బౌ డౌన్' (ముందుకు వంగి నమస్కరిస్తూ..) సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక తన కొడుకు సెంచరీ చేయడంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివరాత్రి రోజున శివాలెత్తిన రోహిత్ - గిల్.. ధర్మశాలలో సెంచరీల మోత !