IPL 2024: 16 మందిని అంటిపెట్టుకుని.. 11 మందికి వీడ్కోలు పలికిన ఢిల్లీ క్యాపిటల్స్.. తుది జాబితా ఇదే..

Published : Nov 27, 2023, 07:00 AM IST
IPL 2024: 16 మందిని అంటిపెట్టుకుని.. 11 మందికి వీడ్కోలు పలికిన ఢిల్లీ క్యాపిటల్స్.. తుది జాబితా ఇదే..

సారాంశం

Delhi Capitals: ఐపీఎల్‌ 2024 సీజన్‌ వేలానికి ముందు కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్‌ (Release)చేసే ఆటగాళ్ల జాబితాను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఈ జాబితాలో  మొత్తంగా 11 మందికి ఉద్వాసన పలకగా.. 16 మందిని తన వద్దనే అంటిపెట్టుకుంది. 

Delhi Capitals: IPL 2024 వేలానికి ముందు కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్‌ (Release)చేసే ఆటగాళ్ల జాబితాను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్‌ వ్యవహరిస్తున్నారు. అతనితో పాటు మొత్తం 16 మంది ఆటగాళ్లను ఢిల్లీ రిటైన్ చేసుకోగా.. ముస్తాఫిజుర్ రెహమాన్, రిలీ రూసో సహా మొత్తం 11 మంది ఆటగాళ్లకు గుడ్ బై చెప్పింది.

ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించిన విదేశీ ఆటగాళ్లలో ఫిల్ సాల్ట్ , రోవ్‌మన్ పావెల్ పేర్లు కూడా ఉన్నాయి. కాగా చేతన్ సకారియా, మనీష్ పాండే, కమలేష్ నాగర్‌కోటి, రిప్పల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమర్ ఖాన్, ప్రియమ్ గార్గ్‌ లకు కూడా స్వస్తి పలికింది. అదే సమయంలో రిషబ్ పంత్, పృథ్వీ షా, ఎన్రిక్ నార్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎన్గిడి, ఇషాంత్ శర్మ మొదలైన  బడా పేయర్లను అంటిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. 

ఐపీఎల్ చివరి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరు మరి దారుణంగా ఉంది. పాయింట్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ లేకుండానే టోర్నమెంట్‌లోకి ప్రవేశించింది. మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. అయితే పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అట్టిపెట్టుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

  • రిలే రుస్సీ,
  • చేతన్ సకారియా,
  • రోవ్‌మన్ పావెల్,
  • మనీష్ పాండే,
  • ఫిల్ సాల్ట్,
  • ముస్తాఫిజుర్ రెహమాన్,
  • కమలేష్ నాగర్‌కోటి,
  • రిపాల్ పటేల్,
  • సర్ఫరాజ్ ఖాన్,
  • అమన్ ఖాన్,
  • ప్రియమ్ గార్గ్.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..

  • రిషబ్ పంత్ (కెప్టెన్),
  • డేవిడ్ వార్నర్,
  • పృథ్వీ షా,
  • అభిషేక్ పోరెల్,
  • అక్షర్ పెటల్,
  • లలిత్ యాదవ్,
  • ఃమిచెల్ మార్ష్,
  • యశ్ ధుల్,
  • ప్రవీణ్ దూబే,
  • విక్కీ ఓస్వాల్,
  • ఎన్రిక్ నోర్చే,
  • కుల్దీప్ యాదవ్,
  • లుంగీ ఎన్గిడి,
  • ఖలీల్ అహ్మద్ .
  • ముఖేష్ కుమార్

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Devdutt Padikkal : 4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. గంభీర్, అగార్కర్‌లకు పెద్ద తలనొప్పి!
Sarfaraz Khan : 16 సిక్సర్లు, 14 ఫోర్లు, 217 రన్స్.. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో రోహిత్ రికార్డు బద్దలు !