IPL 2024: రూ. 13.25 కోట్ల ఆటగాడికి ఉద్వాసన పలికిన ఆరెంజ్ ఆర్మీ.. తుది జాబితా ఇదే!

By Rajesh Karampoori  |  First Published Nov 27, 2023, 6:19 AM IST

Sunrisers Hyderabad  Retention List: ఐపీఎల్ 2024 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తన రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను  ప్రకటించింది. ఆరెంజ్ ఆర్మీగా పేరొందిన సన్ రైజర్స్ హైదరాబాద్.. రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ బ్యాట్స్ మెన్ హ్యారీ బ్రూక్ కు ఉద్వాసన పలకడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఆరుగురు ఆటగాళ్లకు వీడ్కోలు పలికింది. 


Sunrisers Hyderabad  Retention List: IPL 2024 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తన రిటైన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ఆదివారం ప్రకటించింది. ఆరెంజ్ ఆర్మీగా ప్రసిద్ధి చెందిన SRH ఆరుగురు ఆటగాళ్లకు వీడ్కోలు పలికింది. ఈ జాబితాలో రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ ఉండటం అభిమానులందర్నీ ఆశ్చర్యపరిచింది. దూకుడు బ్యాట్స్‌మన్ గత సీజన్‌లో సెంచరీ చేసినా.. క్రమంగా అతని ప్రదర్శన పేలవంగా మారింది. గత సీజన్ లో ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ 11 మ్యాచ్‌ల్లో 21.11 సగటుతో 190 పరుగులు చేశాడు.

అదే సమయంలో హ్యారీ బ్రూక్‌తో పాటు, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివంత్ శర్మ, అకిల్ హుస్సేన్, ఆదిల్ రషీద్‌లకు కూడా ఉద్వాసన పలికింది ఆరెంజ్ ఆర్మీ మెనేజ్ మెంట్. అంతకుముందు.. షాబాజ్ అహ్మద్ స్థానంలో మయాంక్ డాగర్‌ను ఆర్‌సిబికి కొనుగోలు చేసింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరుగురు ఆటగాళ్లకు గుడ్ బై చెప్పడంతో వేలానికి ముందు రూ. 34 కోట్ల పర్స్ మిగిలి ఉంది. రాబోయే వేలంలో ఫ్రాంచైజీ ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. 

Latest Videos

undefined

టైటిల్ కోసం తహతహలాడుతున్న ఆరెంజ్ ఆర్మీ

2008 నుంచి ఐపీఎల్‌లో భాగమైన SRH తన తొలి టైటిల్ కోసం 2016 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. జట్టు ఖాతాలో ఇదొక్కటే టైటిల్. దీని తర్వాత.. 2018 ఎడిషన్‌లో జట్టు రన్నరప్‌గా నిలిచి అద్భుత ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.  ఇది కాకుండా IPL 2020లో జట్టు మూడవ స్థానంలో నిలిచింది.  డేవిడ్ వార్నర్ జట్టు నుండి వైదొలగడం కూడా తీరని నష్టం కలిగించింది. ఇక ఐపీఎల్ 2022, 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. 2023లో ఆరెంజ్ ఆర్మీ 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచింది, 10 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్డ్ లిస్ట్ :

  • హ్యారీ బ్రూక్,
  • సమర్థ్ వ్యాస్,
  • కార్తీక్ త్యాగి,
  • వివరాల్ శర్మ,
  • అకిల్ హుస్సేన్,
  • ఆదిల్ రషీద్.
  • మయాంక్ దాగర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ లిస్ట్: 

  • అబ్దుల్ సమద్,
  • ఐడెన్ మార్క్రామ్,
  • రాహుల్ త్రిపాఠి,
  • గ్లెన్ ఫిలిప్స్,
  • హెన్రిచ్ క్లాసెన్,
  • మయాంక్ అగర్వాల్,
  • అన్మోల్‌ప్రీత్ సింగ్,
  • ఉపేంద్ర యాదవ్,
  • నితీష్ రెడ్డి,
  • షాబాజ్ అహ్మద్ (RCB నుండి ట్రేడ్),
  • అభిషేక్ శర్మ,
  • మార్కో జాన్సెన్,
  • వాషింగ్టన్ సుందర్,
  • భువనేశ్వర్ కుమార్,
  • మయాంక్ మార్కండే,
  • ఉమ్రాన్ మాలిక్,
  • టి నటరాజన్,
  • ఫజహక్ ఫారూఖీ.
click me!