లసిత్ మలింగ రికార్డ్ బ్రేక్ చేసిన బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్..!

By telugu news teamFirst Published Oct 18, 2021, 10:56 AM IST
Highlights

మొదటి రౌండ్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పురుషుల అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్  2021 ( ICC T20 Worldcup) మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి.  యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. కాగా..  ఈ టీ20 వరల్డ్ కప్ లో మొదటి రోజే.. బంగ్లాదేశ్ క్రికెటర్ రికార్డులు బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan ) నెలకొల్పాడు. మొదటి రౌండ్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పురుషుల అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు.

Also Read:ఇండియా-పాక్ మ్యాచ్.. సానియా మీర్జా రియాక్షన్ ఇదే..! 

ఈ మ్యాచ్‌లో షకీబ్ శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ (Lasith Malinga) రికార్డును 2 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. షకీబ్ ప్రస్తుతం 108 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు.2007 నుంచి ప్రతి టీ 20 ప్రపంచకప్‌లో ఆడుతున్న షకీబ్ మరోసారి తన జట్టు కోసం అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, షకీబ్ పేరు మీద 106 వికెట్లు ఉన్నాయి. 

షకీబ్ మరో రెండు వికెట్లు జోడించడంతో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ 11 వ ఓవర్లో లెజెండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మలింగ రికార్డును బద్దలు కొట్టాడు. ఇన్నింగ్స్‌లో షకీబ్ వేసిన మూడో ఓవర్‌లో ఈ రికార్డు బద్దలైంది. మొదట రిఫీ బారింగ్టన్‌ను అఫిఫ్ హుస్సేన్ క్యాచ్ ద్వారా మలింగను సమం చేశాడు. ఆతర్వాత మైఖేల్ లీష్ నాల్గవ బంతికి లిటన్ దాస్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో తన 108 వ వికెట్ తీసి కొత్త రికార్డు సృష్టించాడు.
 

click me!