టీమిండియాను రెచ్చగొట్టిన పీటర్సన్.. హిందీ లో ట్వీట్ చేసి మరీ...

By telugu news teamFirst Published Feb 10, 2021, 8:49 AM IST
Highlights

మ‌రీ అంత‌గా సంబ‌రాలు చేసుకోకండి.. రెండు వారాల్లో అస‌లైన టీమ్ వ‌స్తోంది జాగ్ర‌త్త అని గ‌త నెల 19న కేపీ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెల‌వ‌గానే నేను ముందే చెప్పాను గుర్తుందా అన్న‌ట్లుగా మ‌రో ట్వీట్ చేయ‌డం విశేషం. 
 

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా... టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో.. టీమిండియా ఓటమి తర్వాత ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. టీమిండియాను రెచ్చగొట్టేలా పీటర్సన్ చేసిన ట్వీట్... ఇప్పుడు ఇండియన్ అభిమానులకు ఆగ్రహం తెచ్చేలా ఉండటం గమనార్హం.

మా టీమ్‌తో జాగ్ర‌త్త అని ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా అని కేపీ హిందీలో ట్వీట్ చేశాడు. గ‌త నెల‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచిన త‌ర్వాత పీట‌ర్స‌న్ ఓ ట్వీట్ హెచ్చ‌రిక పంపాడు. మ‌రీ అంత‌గా సంబ‌రాలు చేసుకోకండి.. రెండు వారాల్లో అస‌లైన టీమ్ వ‌స్తోంది జాగ్ర‌త్త అని గ‌త నెల 19న కేపీ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెల‌వ‌గానే నేను ముందే చెప్పాను గుర్తుందా అన్న‌ట్లుగా మ‌రో ట్వీట్ చేయ‌డం విశేషం. 

'ఆస్ట్రేలియా సిరీస్‌ విజయం సాధించినప్పుడే హెచ్చరించా. భారత్‌ ఎక్కువగా సంబరాలు చేసుకోవద్దని. అదే నిజం అయింది ఇప్పుడు' అని పేర్కొన్నాడు. తొలి టెస్టు ఓటమిపై టీమిండియా అభిమానులు ఫలితంపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. గత సిరీస్‌ల్లో తొలి మ్యాచ్ కోల్పోయినా.. భారత్‌ సిరీస్‌ సాధించిందని గుర్తు చేస్తున్నాడు. 

India , yaad hai maine pehele hi chetawani di thi ke itna jasn na manaye jab aapne Australia ko unke ghar pe haraya tha 😉

— Kevin Pietersen🦏 (@KP24)

'భారత అభిమానులారా.. మీరెవరు బెంగపడకండి. ఆసీస్‌ టూర్‌ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్‌ను గెలిచింది. అంతకముందు స్వదేశంలోనూ తొలి టెస్టు మ్యాచ్‌ ఓడి ఆ తర్వాత సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉంది. ఒక్కమ్యాచ్‌ ఓడిపోయినంత మాత్రానా సిరీస్‌ కోల్పోయినట్టు కాదు.. ధైర్యంగా ఉండండి' అని ట్వీట్ చేశాడు.
 

click me!