
యాషెస్ సిరీస్ చిత్రాలు క్రికెట్ ఫ్యాన్స్‌కి చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. తొలి టెస్టులో తొందరపడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇన్నింగ్స్, నాలుగో ఇన్నింగ్స్‌లో ఆఖరి 2 వికెట్లు తీయలేక ఓడింది. రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో అవుట్ గురించి క్రీడా స్ఫూర్తి అంటూ నానా రచ్చ జరిగింది..
మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. దీంతో సిరీస్ ఆశలు నిలవాలంటే మూడో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పడింది ఇంగ్లాండ్. అయితే మూడో టెస్టులో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ని అంత ఈజీగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 118 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశాడు. మార్క్ వుడ్ 5 వికెట్లు తీస్తే క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. మొదటి రోజు రెండు సెషన్లలోనే ఆస్ట్రేలియాని ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, మూడో సెషన్‌లో బ్యాటింగ్‌కి వచ్చింది..
అయితే బెన్ డక్లెట్ 2, హారీ బ్రూక్ 3, జాక్ క్రావ్లే 33 పరుగులు చేసి అవుట్ కాగా జో రూట్ 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. జానీ బెయిర్ స్టో 12 పరుగులకే అవుట్ కావడంతో 87 పరుగులకే సగం టీమ్ పెవిలియన్‌కి చేరింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 98, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేసిన బెన్ డక్లెట్‌ని ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశాడు..
బెన్ డక్లెట్ బ్యాటుని ముద్దాడుతూ వెళ్లిన బంతి, నేరుగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. క్యాచ్ అందుకున్న అలెక్స్ క్యారీ, బంతిని ముద్దాడడం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఇదే సమయంలో కామెంటేటర్‌గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్... ‘ఓ... అది కచ్ఛితంగా ముద్దే... అలెక్స్ క్యారీ, కాస్త కంట్రోల్ చేసుకో...’ అంటూ కామెంట్ చేయడం వినిపించింది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
30 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 162 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ ముగిసిన తర్వాత క్రీజు దాటుతున్న జానీ బెయిర్‌స్టోని, అలెక్స్ క్యారీ రనౌట్ చేశాడు. జానీ బెయిర్ స్టో పరుగు తీసే ఉద్దేశంతో క్రీజు దాటకపోవడంతో ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ దీనిపై పెద్ద చర్చే జరిగింది..