ఛతేశ్వర్ పూజారా సెంచరీ, సూర్యకుమార్ హాఫ్ సెంచరీ... రింకూ సింగ్ మెరుపులు! సర్ఫరాజ్ ఖాన్ డకౌట్...

By Chinthakindhi RamuFirst Published Jul 7, 2023, 2:00 PM IST
Highlights

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచిన సర్ఫరాజ్ ఖాన్... రెండో ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పూజారా సెంచరీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ..  సెంట్రల్ జోన్ తరుపున రింకూ సింగ్ ఒంటరి పోరు.. 

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ టెస్టు బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా, దులీప్ ట్రోఫీ 2023 టోర్నీలో దుమ్ము దులిపే ప్రదర్శన ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 30+ అందుకోలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మొదటి సెమీ ఫైనల్‌లో శతకంతో మెరిశాడు..

తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ 220 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పృథ్వీ షా 26 పరుగులు చేయగా కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 13 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 102 బంతులు ఆడి 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా తీవ్రంగా నిరాశపరిచాడు. సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేయగా సర్ఫరాజ్ ఖాన్ 12 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. 

హేత్ పటేల్ 5 పరుగులు చేసి అవుట్ కాగా అతిత్ సేత్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధర్మేంద్ర సిన్మా జడేజా 39 పరుగులు చేయగా చింతన్ గజా 14 పరుగులు చేశాడు. సెంట్రల్ జోన్ కెప్టెన్ శివమ్ మావి 6 వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్, యష్ ఠాకూర్, సౌరబ్ కుమార్, సరన్ష్ జైన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది..

సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వివేక్ సింగ్ 2, హిమాన్షు మంత్రి 4, అమన్‌దీప్ 4, ఉపేంద్ర కుమార్ 5 పరుగులు చేయగా కెప్టెన్ శివమ్ మావి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ధృవ్ జురెల్ 55 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేయగా 69 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేసిన రింకూ సింగ్... ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు...

వెస్ట్ జోన్ బౌలర్లలో నాగస్వల్లా 5 వికెట్లు తీయగా అతిత్ సేత్‌కి 3, చింతన్ గజాకి రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 25 పరుగులు చేయగా ప్రియాంక్ పంచల్ 15 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 6 పరుగులకే అవుటై మరోసారి నిరాశపరిచినా ఛతేశ్వర్ పూజారా సెంచరీతో చెలరేగాడు..

58 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసుకుని అవుటైతే ఛతేశ్వర్ పూజారా 266 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 132 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. హేత్ పటేల్ 27, అతిత్ సేత్ 9 పరుగులు చేయడంతో 90 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది వెస్ట్ జోన్.. 

సౌత్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో నార్త్ జోన్ 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ప్రభుసిమ్రాన్ 49 పరుగులు చేయగా అంకిత్ కుమార్ 33, హర్షిత్ రాణా 31, వైభవ్ అరోరా 23 పరుగులు చేశారు. 

 తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 195 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మయాంక్ అగర్వాల్ 76 పరుగులు చేయగా కెప్టెన్ హనుమ విహారి డకౌట్ అయ్యాడు. తిలక్ వర్మ 46 పరుగులు చేయగా వాసింగ్టన్ సుందర్ 12 పరుగులు చేశాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 3 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన నార్త్ జోన్ 42 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ప్రభుసిమ్రాన్ సింగ్ 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

click me!