DCvsSRH: బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఢిల్లీకి తొలి ఓటమి...

Published : Sep 29, 2020, 11:23 PM ISTUpdated : Sep 29, 2020, 11:36 PM IST
DCvsSRH: బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఢిల్లీకి తొలి ఓటమి...

సారాంశం

34 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌... మూడు కీలక వికెట్లు తీసిన రషీద్ ఖాన్...

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో గత మ్యాచ్ కంటే మంచి పర్ఫామెన్స్ కనబర్చగా, బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి విజయాన్ని అందించింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీషా 2 పరుగులు చేసి అవుట్ కాగా... 21 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయ్యర్‌ను అవుట్ చేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే 31 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ కూడా అవుట్ అయ్యాడు.

రెండు భారీ సిక్సర్లు బాది 21 పరుగులు చేసిన హెట్మయర్‌ను భువనేశ్వర్ అవుట్ చేయగా...  27 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రిషబ్ పంత్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. డేంజర్ మ్యాన్ స్టోయినిస్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది.

రషీద్ ఖాన్‌ 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ 2, ఖలీల్ అహ్మద్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 Records : కేవలం ఒక్క విజయంతో... టీమిండియా ఖాతాలో ఇన్ని రికార్డులా..!
T20 World Cup 2026 ఛాంపియన్‌గా భారత్.. విన్నింగ్ మూమెంట్స్