DCvsSRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్ మెరుపులు..

Published : Sep 29, 2020, 09:24 PM IST
DCvsSRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్ మెరుపులు..

సారాంశం

జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీ... మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్... విలియంసన్ మెరుపులు...

IPL 2020 సీజన్ 13లో మొట్టమొదటిసారి మంచి స్కోరు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో మరోసారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో  45 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. 

మనీశ్ పాండే 3 పరుగులకే పెవిలియన్ చేరినా... జానీ బెయిర్‌స్టో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో ఆడని కేన్ విలియంసన్ వస్తూనే మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసిన విలియంసన్ ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?