RCBvsMI: రాయల్ ఛాలెంజర్స్ ‘సూపర్’ విక్టరీ... ఉత్కంఠ ‘టై’...

By team teluguFirst Published Sep 29, 2020, 12:04 AM IST
Highlights

24 బంతుల్లో 80 పరుగులు కావాల్సిన దశలో పోలార్డ్, కిషన్ మెరుపులు...

చివరి 5 ఓవర్లలో 90 పరుగులు ఇచ్చిన ఆర్‌సీబీ బౌలర్లు...

పోలార్డ్ విశ్వరూపం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న ఇషాన్ కిషన్...

ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత కిక్‌నిచ్చింది. బెంగళూరు ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్తా, పోలార్డ్, ఇషాన్ కిషన్‌ల ఇన్నింగ్స్‌ల కారణంగా ‘టై’గా మారి.. సూపర్ ఓవర్‌లోనూ ఉత్కంఠ కొనసాగింది. సూపర్ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది, ఆర్‌సీబీకి రెండో విజయాన్ని అందించాడు కింగ్ కోహ్లీ. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై, మ్యాచ్ చేజార్చుకునేలా కనిపించింది. అయితే యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, కిరన్ పోలార్డ్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

ఇషాన్ కిషన్ 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసి, ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా... కిరన్ పోలార్డ్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. 24 బంతుల్లో 80 పరుగులు కావాల్సిన దశలో పోలార్డ్, కిషన్ వరుస బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించారు. ఆఖరి ఓవర్‌ రెండు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో ఇషాన్ కిషన్ అవుట్ కావడం, ఆఖరి బంతికి పోలార్డ్ ఫోర్ బాదడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు పోలార్డ్.

సూపర్ ఓవర్‌లో కేవలం 7 పరుగులే చేసింది ముంబై..
నవ్‌దీప్ షైనీ వేసిన ఓవర్‌లో సింగిల్, సింగిల్, డాట్, ఫోర్ పరుగులు వచ్చాయి. ఐదో బంతికి పోలార్డ్ అవుట్ కావడం, ఆఖరి బంతికి సింగిల్ రావడంతో బెంగళూరు టార్గెట్ 8 పరుగులుగా ఫిక్స్ అయ్యింది.

బెంగళూరు విజయం సాధించిందిలా...
బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌లో సింగిల్, సింగిల్ రాగా... మూడో బంతికి ఏబీడీని అవుట్ ఇచ్చాడు అంపైర్. అయితే రివ్యూకి వెళ్లిన ఆర్‌సీబీకి అనుకూలంగా రివ్యూ రావడంతో ఏబీడీ బతికి పోయాడు. ఆ తర్వాతి బంతికి ఏబీడీ ఫోర్ బాదాడు. ఐదో బంతికి సింగిల్ తీయగా... ఆఖరి బంతికి సింగిల్ తీయాల్సిన టైమ్‌లో బౌండరీ బాదాడు కోహ్లీ...

click me!