DCvsCSK: ‘గబ్బర్’ వన్ మ్యాన్ షో... సెంచరీతో ఢిల్లీని గెలిపించిన ధావన్...

Published : Oct 17, 2020, 11:22 PM ISTUpdated : Oct 17, 2020, 11:26 PM IST
DCvsCSK: ‘గబ్బర్’ వన్ మ్యాన్ షో... సెంచరీతో ఢిల్లీని గెలిపించిన ధావన్...

సారాంశం

సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్... సిక్సర్లతో మ్యాచ్ ఫినిష్ చేసిన అక్షర్ పటేల్...సీజన్‌లో చెన్నైకి ఆరో ఓటమి...  

IPL 2020 సీజన్‌లో మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయినా 180 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి, రికార్డు విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాల్లోకి నెట్టేసింది.

180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పృథ్వీ షా డకౌట్ కాగా అజింకా రహానే 8 పరుగులకి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కస్ స్టోయినిస్ 14 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా శిఖర్ ధావన్ బౌండరీలతో ఒంటరిపోరాటం చేశాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులతో అజేయ శతకం బాదాడు. విజయానికి 5 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో మళ్లీ టాప్‌లోకి వెళ్లింది ఢిల్లీ క్యాపిటల్.
 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం