DC vs CSK: జడ్డూ, అంబటి సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

Published : Oct 17, 2020, 09:12 PM IST
DC vs CSK: జడ్డూ, అంబటి సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

సారాంశం

డుప్లిసిస్ హాఫ్ సెంచరీ... రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించిన డుప్లిసిస్, షేన్ వాట్సన్... మెరుపులు మెరిపించిన అంబటి రాయుడు, రవీంద్ర జడేజా... మరోసారి ఫెయిల్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ...

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే సామ్ కుర్రాన్ డకౌట్‌గా పెవిలియన్ చేరినా, సీనియర్లు షేన్ వాట్సన్, డుప్లిసిస్ కలిసి రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్నారు. షేన్ వాట్సన్ 28 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ కాగా, డుప్లిసిస్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి 3 పరుగులకే అవుటై నిరాశపరచగా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా కలిసి ఆఖరి ఓవర్లలో బౌండరీల వర్షం కురిపించారు. అంబటి రాయుడు 25 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్ల‌తో 45 పరుగులు చేయగా రవీంద్ర జడేజా  13 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులు రాబట్టాడు.  

ఈ ఇద్దరి కారణంగా ఆఖరి 5 ఓవర్లలో 67 పరుగులు రాబట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోకియాకు రెండు వికెట్లు దక్కగా, రబాడా, దేశ్‌పాండే తలా ఓ వికెట్ తీశారు.

PREV
click me!

Recommended Stories

IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !