చాలా రోజుల తర్వాత ప్యాంట్ వేసుకున్నా.. పెళ్లిరోజున మంజ్రేకర్ లాక్ డౌన్ జోక్

Published : Jun 09, 2020, 09:08 AM IST
చాలా రోజుల తర్వాత ప్యాంట్ వేసుకున్నా.. పెళ్లిరోజున మంజ్రేకర్ లాక్ డౌన్ జోక్

సారాంశం

ఈ విషయాన్ని క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అది కూడా తన పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేయడం గమనార్హం.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

 ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. కాగా.. లాక్ డౌన్ ఈ లాక్ డౌన్ ఎవరూ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు. దీంతో.. దాదాపు అందరూ నైట్ సూట్ లతోనే కాలం గడిపేస్తున్నారు. నీట్ గా డ్రెస్ అప్ అవ్వని వాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఈ ఫార్మూలా సెలబ్రెటీలకు కూడా వర్తిస్తుంది.

ఈ విషయాన్ని క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అది కూడా తన పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేయడం గమనార్హం.

 

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల సంజయ్ మంజ్రేకర్ తన భార్యతో పెళ్లి రోజు జరుపుకున్నారు. కాగా.. ఆ రోజు ఆయన నీట్ గా డ్రస్ వేసుకన్నారట. ఈ లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లాల్సిన అవసరం రాకపోవడంతో షార్ట్స్ తో కాలం గడిపేశారు. పెళ్లి రోజు కాబట్టి ఆరోజు ప్యాంట్ వేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

‘‘ ఈ రోజు మా పెళ్లిరోజు కదా.. అందుకే చాలా రోజుల తర్వాత ప్యాంట్ వేసుకున్నాను’’ అంటూ సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేయడం విశేషం. ఆయన ట్వీట్ కి అభిమానుల నుంచి సమాధానాలు కూడా అంతే ఫన్నీగా వస్తుండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Zanai Bhosle : ఆశా బోంస్లే మనవరాలితో సిరాజ్‌ రిలేషన్ ఏంటి..? ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ
Womens Cricket: విజేత‌ల‌కు రూ. 82 కోట్ల బ‌హుమ‌తి.. క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు