CSK vs RR: అంబటి రాయుడికి మళ్లీ అన్యాయం జరిగిందా?... ఎవరీ రుతురాజ్ గైక్వాడ్...

Published : Sep 22, 2020, 07:29 PM ISTUpdated : Sep 22, 2020, 08:56 PM IST
CSK vs RR: అంబటి రాయుడికి మళ్లీ అన్యాయం జరిగిందా?... ఎవరీ రుతురాజ్ గైక్వాడ్...

సారాంశం

మొదటి మ్యాచ్‌లో ఫెయిల్ అయిన మురళీ విజయ్‌కి మరో ఛాన్స్ ఇచ్చిన ధోనీ... అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన అంబటి రాయుడికి మాత్రం నో ఛాన్స్... రాయుడు 100 శాతం ఫిట్‌గా లేడని చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ...

CSK vs RR: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో అమూల్యమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు. అయితే రెండో మ్యాచ్‌లో అతనికి స్థానం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని తప్పించి, ఆ స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి అవకాశం కల్పించాడు ధోనీ.

ఇంతకుముందు టూ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నప్పటికీ 2019 వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడికి చోటు దక్కలేదు. ఆ బాధతోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసిన రాయుడు 100 శాతం ఫిట్‌గా లేడని తప్పించడం ఏంటనేది అందరి అనుమానం.

రుతురాజ్‌ను ఆడించాలనుకుంటే మొదటి మ్యాచ్‌లో ఫెయిల్ అయిన మురళీ విజయ్‌ని గానీ, స్లో ఇన్నింగ్స్ ఆడిన డుప్లిసిస్‌ను గానీ తప్పించొచ్చు. మరి వారికి అవకాశం ఇచ్చి అంబటి రాయుడిని తప్పించడం అతనికి అన్యాయం చేయడమే అంటున్నారు హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ ఫ్యాన్స్. 


ఎవరీ రుతురాజ్ గైక్వాడ్... 
23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2020లో సురేశ్ రైనా లేని లోటును తీరుస్తాడని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. జూన్‌లో శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్‌లో 187 పరుగులతో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, 19 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో మూడు సెంచరీలతో 1,193 పరుగులు చేశాడు. 52 లిస్టు ఏ మ్యాచుల్లో 2,438 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 28 టీ20 మ్యాచుల్లో 6 హాఫ్ సెంచరీలతో 843 పరుగులు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !