CSK vs RCB: విరాట్ కోహ్లీ విధ్వంసం... ఆర్‌సీబీ భారీ స్కోర్...

Published : Oct 10, 2020, 09:14 PM ISTUpdated : Oct 10, 2020, 09:22 PM IST
CSK vs RCB: విరాట్ కోహ్లీ విధ్వంసం... ఆర్‌సీబీ భారీ స్కోర్...

సారాంశం

విరాట్ కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీ... 33 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్... ఆఖరి 5 ఓవర్లలో 74 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్...

IPL 2020: ఫామ్‌లో ఉంటే... ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతాడో అలాంటి ఇన్నింగ్స్ ఆడి చూపించాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేయగలిగింది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ ఫించన్ 2 పరుగులే పెవిలియన్ చేరినా యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 34 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఏబీ డివిల్లియర్స్ డకౌట్ కాగా, వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 

15 ఓవరల్లో 95 పరుగులు మాత్రమే చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఆ తర్వాత విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా మంచి స్కోరు చేయగలిగింది. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ... 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. శివమ్ దూబే 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ రెండు, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్ చెరో వికట్ తీశారు.

PREV
click me!

Recommended Stories

Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా