KXIPvsKKR: చేజేతులా ఓడిన పంజాబ్... కేకేఆర్ ‘ఉత్కంఠ’ విజయం...

Published : Oct 10, 2020, 07:28 PM ISTUpdated : Oct 10, 2020, 07:38 PM IST
KXIPvsKKR: చేజేతులా ఓడిన పంజాబ్... కేకేఆర్ ‘ఉత్కంఠ’ విజయం...

సారాంశం

కెఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాహుల్, మయాంక్ హాఫ్ సెంచరీలు... మొదటి వికెట్‌కి మరోసారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్, రాహుల్... ఆఖరి రెండు ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పిన కేకేఆర్ బౌలర్లు... ప్రసిద్ధ్ కృష్ణకు 3 వికెట్లు...

IPL 2020 సీజన్‌లో ఎట్టకేలకు రెండో విజయాన్ని అందుకోవాలన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశలు తీరలేదు. సులువుగా గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత పోరాటంతో ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంటుందని అనిపించింది. అయితే ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

లక్ష్యం చిన్నది కావడంతో ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా స్లో అండ్ స్టడీగా ఇన్నింగ్స్ నిర్మించారు రాహుల్, మయాంక్. మొదటి వికెట్‌కి 115 పరుగులు జోడించిన తర్వాత 39 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 56 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు.  నికోలస్ పూరన్‌ 10 బంతుల్లో 16 పరుగులు చేయగా సిమ్రాన్ 4 పరుగులు చేశాడు.

విజయానికి 14 పరుగులు కావాల్సిన దశలో 58 బంతుల్లో 6 ఫోర్లతో 74 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సిన దశలో 11 పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి సిక్స్ బాదితే టై అవుతుందన్న సమయంలో మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్‌కి బౌండరీ వచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో కేకేఆర్ ఉత్కంఠ విజయం సాధించింది. 

యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకి మూడు వికెట్లు దక్కగా... సునీల్ నరైన్ 2 వికెట్లు తీశాడు.   . 

PREV
click me!

Recommended Stories

Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా