షాహిద్ కపూర్ కవర్ డ్రైవ్ కు...ఫిదా అయిన సురేష్ రైనా (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 23, 2020, 11:57 AM ISTUpdated : Oct 23, 2020, 12:04 PM IST
షాహిద్ కపూర్ కవర్ డ్రైవ్ కు...ఫిదా అయిన సురేష్ రైనా (వీడియో)

సారాంశం

క్రికెట్ నేపథ్యంలో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న జెర్సీ సినిమా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోంది. 

ముంబై: బాలివుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ హీరోగా టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న జెర్సీ మూవీ హిందీలో తెరకెక్కెతున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ క్రికెటర్ కు ఏమాతం తీసిపోనివిధంగా ఓ కవర్ డ్రైవ్ షాట్ ఆడుతున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.   

''తెల్లవారుజామునే... డ్రైవ్ తో నిద్ర లేస్తున్నా'' అంటూ సరదా క్యాప్షన్ తో వీడియోను పోస్ట్ చేశాడు షాహిద్. ఈ వీడియో మాజీ టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా కు తెగ నచ్చినట్లుంది. దీంతో వెంటనే షాహిద్ వీడియోపై కామెంట్ చేశాడు. '' సూపర్ కవర్ డ్రైవ్ మ్యాన్! ఈ షాటే కాదు హెడ్ పొజిషన్ కూడా అద్భుతం. నీకు ఎల్లపుడూ మంచే జరగాలని కోరుకుంటున్నా'' అంటూ రైనా కామెంట్ చేశాడు. 

 

తెలుగులో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్నలూరి హిందీలోనే తెరకెక్కిస్తున్నారు. జెర్సీ పేరుతోనే హిందీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు ఈ సినిమా యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డిని హిందీలో తీసి అద్భుత విజయాన్ని అందుకున్న షాహిద్ ఇప్పుడు జెర్సీలో నటిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?