కోహ్లీ రికార్డు కొట్టిన సీఎస్‌కే ప్లేయర్ జగదీశన్.. విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగో సెంచరీ బాది...

By Chinthakindhi RamuFirst Published Nov 20, 2022, 9:37 AM IST
Highlights

విజయ్ హాజారే ట్రోఫీ 2022 టోర్నీలో నాలుగు సెంచరీలు బాదిన నారాయణ్ జగదీశన్... విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్ తర్వాత ఒకే ఎడిషన్‌లో నాలుగు సెంచరీలు బాదిన ఐదో బ్యాటర్‌గా రికార్డు...

విజయ్ హాజారే ట్రోఫీ 2022లో తమిళనాడు వికెట్ కీపర్, చెన్నై సూపర్ కింగ్స్ నారాయణ్ జగదీశన్, అద్భుత ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. లిస్టు ఏ క్రికెట్‌లో వరుసగా నాలుగు సెంచరీలు బాది, విజయ్ హాజారే ట్రోఫీలో ఒకే ఎడిషన్‌లో ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు జగదీశన్...

ఇంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2008-09 సీజన్‌లో మొట్టమొదటిగా ఈ ఫీట్ సాధించి, రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 2020లో రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా ఈ ఫీట్ సాధించారు. 2021లో యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా విజయ్ హాజారే ట్రోఫీలో ఒకే ఎడిషన్‌లో నాలుగు సెంచరీలు బాదాడు...

2008-09 సీజన్‌లో 102, 119 నాటౌట్, 124, 114 పరుగులు చేసి 7 మ్యాచుల్లో కలిపి 89 సగటుతో 534 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. తాజాగా హార్యానాతో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద సిక్సర్ బాది సెంచరీ మార్కును అందుకున్నాడు నారాయణ్ జగదీశన్. 123 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 128 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు ఎన్ జగదీశన్...

తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 67, షారుక్ ఖాన్ 46 పరుగులు చేశారు. సోనూ యాదవ్ (13 పరుగులు) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. 
 
285 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన హర్యానా 28.3 ఓవర్లలో 133 పరుగులకి ఆలౌట్ అయ్యి 151 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.రాహుల్ తెవాటియా 34 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్ బాబా అపరాజిత్ 3 వికెట్లు తీయగా సందీప్ వారియర్, మహ్మద్, సోనూ యాదవ్ మూడేసి వికెట్లు తీశారు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. వారిలో రుతురాజ్ గైక్వాడ్, సూపర్ సక్సెస్ సాధించి.. చెన్నై సూపర్ కింగ్స్‌కి కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి తొలి మ్యాచ్‌లో 33 పరుగులు చేసి మెప్పించిన ఎన్ జగదీశన్ మాత్రం మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు...


ఐపీఎల్ 2020 సీజన్‌లో 5 మ్యాచులు ఆడి 2 సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ఎన్ జగదీశన్, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తం రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2022 సీజన్‌లో మళ్లీ 2 సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ఎన్ జగదీశన్, ఓ మ్యాచ్‌లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

click me!